ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Jan 18, 2022, 2:55 PM IST

  • మంత్రి కాళ్ల మీద పడిన రైతులు..

Minister Niranajan Reddy: నేలరాలిన మిరప కాయలను చూపిస్తూ.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిన కాళ్ల మీద పడ్డారు. జిల్లాలో ఇటీవల నష్టపోయిన ప్రాంతాల్లో స్థానికమంత్రి ఎర్రబెల్లితో కలిసి నిరంజన్​రెడ్డి పర్యటించారు. పరకాల మం. నాగారంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు.

  • పాలమూరులో 900 పడకల ఆస్పత్రి..

Harish Rao Inaugurated Balanagar CHC: మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హరీశ్​రావు స్పష్టం చేశారు.

  • డోసుల మధ్య గడువు తగ్గించండి..

Harish Rao Letter to Central Minister: రెండో, బూస్టర్ డోసు మధ్య గడువు తగ్గించాలని కేంద్రమంత్రి మన్​సుఖ్ మాండవీయను మంత్రి హరీశ్​రావు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి హరీశ్​రావు లేఖ రాశారు.

  • గతతంత్ర వేడుకలపై ఉగ్రకుట్ర..

Republic Day 2022: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నాయని నిఘా సంస్థల సమాచారం. ప్రజా సమూహాలు, రద్దీ ప్రదేశాలను, కీలక కట్టడాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని తెలుస్తోంది.

  • ఐదుసార్లు టీకా తీసుకున్న వైద్యుడు..

Bihar Doctor Vaccine News: బిహార్​లోని ఓ సివిల్​ సర్జన్​ 5 సార్లు వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

  • ఫోన్​ను మింగిన ఖైదీ.. ఆ తర్వాత..

Jail inmate swallowed mobile: తిహాడ్ జైలులో ఓ ఖైదీ సెల్​ఫోన్ మింగేశాడు. అధికారులకు తెలియకుండా ఫోన్​ను వాడుతున్న ఆ వ్యక్తి.. తనిఖీల్లో దొరికిపోయాడు. దీంతో అమాంతం ఫోన్​ను మింగేశాడు. పది రోజుల పాటు ప్రయత్నించి ఆపరేషన్ అవసరం లేకుండానే ఫోన్​ను బయటకు తీశారు వైద్యులు.

  • జోరుగా హిమపాతం..

Winter Storm USA: అమెరికా తూర్పు తీరాన్ని హిమపాతం వణికిస్తోంది. న్యూయార్క్‌, ఓహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో అడుగుల మేర మంచుదుప్పటి పరుచుకుంది. ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. మసాచుసెట్స్‌, కనెక్టికట్‌, రోడ్ ఐలాండ్‌లను మంచు వర్షం భయపెడుతోంది.

  • ఆ కార్ల ధరలు ప్రియం..

Tata Car Price Hike: టాటా కార్లు మరింత ప్రియం కానున్నాయి. జనవరి 19న ధరలు స్వల్పంగా సగటున 0.9 శాతం మేర పెరగనున్నట్లు టాటా మోటార్స్​ ఒక ప్రకటనలో తెలిపింది.

  • తాగి రచ్చ చేసిన క్రికెటర్లు..

AUS vs ENG: యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​పై ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ ఆనందంలో కొందరు క్రికెటర్లు శ్రుతిమించి మద్యం సేవించి హోటల్​ గదిలో అల్లరి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి గట్టి వార్నింగ్​ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

  • ఆ కేసులో పూనమ్​ పాండేకు ఊరట..

Poonam Pandey Pornography Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్​ నటి పూనమ్​ పాండేకు ఊరట లభించింది. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.