ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Jan 17, 2022, 4:54 PM IST

  • వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

రేపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్‌లో చర్చించగా.. తుదిదశకు చేరిందని అధికారులు తెలిపారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని అధికారులు తెలిపారు.

  • కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేత..

Direct hearings stopped in Courts: కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో న్యాయస్థానాల విధుల నిర్వహణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో తక్షణమే ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4 వరకు ఆన్​లైన్​లోనే కోర్టుల నిర్వహణ జరపాలని ఆదేశించింది.

  • ఈతకు వెళ్లి గల్లంతు

Students drown in Pranahitha River : ఈత కోసం ప్రాణహిత నదిలో దిగిన ముగ్గురు విద్యార్థులు కొట్టుకుపోయారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గాం సమీపంలో సాయి, వంశీ, రాకేశ్ ఈత కోసం నదిలోకి దిగారు. ముగ్గురూ గల్లంతవగా గాలింపు చేపట్టారు.

  • పాత్రికేయులకు పోస్టల్​ బ్యాలెట్​...

Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా పాత్రికేయులు తమ ఓటును వినియోగించుకునేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ). వారితో పాటు ఎన్నికల జరిగిన రోజు అత్యసవర సేవలు అందించే సిబ్బందికి ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ.

  • పోలీసులపై కరోనా పంజా..

Delhi Police Corona: దిల్లీ పోలీసు విభాగంపై కరోనా పంజా విసురుతోంది. ఈ నెల ప్రారంభం నుంచి మొత్తం 2,500 మంది సిబ్బంది వైరస్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. 767 మంది కోలుకున్నట్లు పేర్కొన్నారు.

  • ఆ మొక్కకు కరోనాను నిరోధించే శక్తి..

Phytochemicals in plants: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించే ఫైటోకెమికల్స్​ను హిమాలయాల్లోని ఓ మొక్కలో గుర్తించారు ఐఐటీ పరిశోధకులు. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి కరోనా వైరస్​ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కల్లో లభించే ఫైటోకెమికల్స్​ కీలకంగా మారనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్​ దాడి..

Drone attack: అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్​ దాడులు చేసింది హౌతీ తిరుగుబాటు సంస్థ. ఈ దాడులతో మూడు చమురు ట్యాంకులు పేలిపోయినట్లు పోలీసులు తెలిపారు.

  • స్వల్ప లాభాలతో ముగింపు..

Stock Market: స్టాక్​మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ముడి చమురు ధర బ్యారెల్​కు 86 డాలర్ల పైకి చేరడం, బాండ్లపై రాబడి పెరగడం వల్ల రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలు ఆర్జించాయి.

  • జట్టు కోసం రూట్ త్యాగం..

Joe root ipl 2022: ఈ ఏడాది ఐపీఎల్​ వేలం​లో పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు ఇంగ్లాండ్​ టెస్టు జట్టు కెప్టెన్​ జో రూట్​. యాషెస్​ సిరిస్​లో ఘోర పరాభవం అనంతరం జట్టు పునర్​నిర్మాణంపైనే పూర్తిగా దృష్టి సారించనున్నట్లు చెప్పాడు.

  • ఒక్క ఫైట్​కే అన్ని కోట్లా..?

Prabhas Salar movie: ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న​ 'సలార్' సినిమా ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే ఇటీవలే డార్లింగ్​తో ఓ భారీ యాక్షన్​ సీన్​ను చిత్రీకరించారట. దీని కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.