ETV Bharat / city

Top news: టాప్​ న్యూస్ @ 7PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news in Telangana
టాప్​ న్యూస్ @ 7PM
author img

By

Published : Jan 6, 2022, 7:01 PM IST

12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులకు శిక్షలు విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో 2014లో ఓ స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై అత్యాచారం జరిగింది

  • ఆయనేమైనా ప్రధాన మంత్రా?'

Guru Granth Sahib Sacrilege Case: భారీ బందోబస్తు మధ్య గురుగ్రంథ్​ సాహిబ్​ కేసు నిందితుడైన రామ్​ రహీమ్​ను పంజాబ్​ తరలించేందుకు అతను వీఐపీ ఏం కాదని వ్యాఖ్యానించింది పంజాబ్​-హరియాణా హైకోర్టు. విచారణ జరపాల్సి వస్తే రోహ్​తక్​లోని సునారియాలో జైలులో ఉన్న నిందితుడిని కలుసుకోవాలని సూచించింది.

  • పత్తి రైతు బలవన్మరణం

Farmer suicide: ఈ ఏడాది పత్తికి మంచి ధర ఉంది కానీ దిగుబడి సరిగా లేదు. దిగుబడి లేక అప్పులు తీసుకొచ్చి మరీ పత్తి సాగు చేసిన రైతులు.. అప్పులు తీర్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు తెచ్చి పత్తి సాగు చేసిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడియతండాలో చోటుచేసుకుంది.

  • బాలిక సజీవదహనం- ప్రియుడి పనే!

Teenager Burnt Alive: ఓ బాలికపై కిరోసిన్​ పోసి నిప్పంటించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో జరిగింది. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కొందరు యువకులు ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది బాధితురాలి తల్లి

  • 'లూడో లవ్'​- బోర్డర్ క్రాస్​ చేసేలోగా...

Online Ludo Love: లూడో గేమ్​లో ఏర్పడిన పరిచయంతో సరిహద్దు దాటేందుకు సిద్ధమైంది ఓ మహిళ. ప్రియుడి సూచనలపై సరిహద్దు ప్రాంతాలకు కూడా చేరుకుంది. కానీ పోలీసులకు ఆటో డ్రైవర్​ సమాచారం ఇచ్చేసరికి ఆమె ప్లాన్​ ఫెయిలైంది. మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇంతకీ ఈ లూడో ప్రేమకథ ఎక్కడిది అంటే..

  • కిమ్ కోసం జనం.. ఏం చేశారంటే.!

North Korea rally: ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల ప్యాంగ్‌యాంగ్‌లోని కిమ్‌-2 సంగ్ స్క్వేర్‌ జన సంద్రాన్ని తలపించింది

  • మంచు లక్ష్మికి కరోనా..!

Manchu Lakshmi Coronavirus: నటి, నిర్మాత మంచు లక్ష్మి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తానే స్వయంగా వెల్లడించారు.

  • 'కపిల్​ దేవ్​కు మీరిచ్చే పెద్ద గిఫ్ట్​ అదే'

Kapil Dev Birthday: క్రికెట్​ దిగ్గజం కపిల్​ దేవ్​ పుట్టినరోజు సందర్భంగా అతడిపై ప్రశంసల జల్లు కురిపించాడు మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ నెగ్గి టీమ్ఇండియా.. కపిల్​కు బర్త్​డే గిఫ్ట్​ ఇవ్వాలని అన్నాడు. లిటిల్​ మాస్టర్​ సచిన్​ కూడా కపిల్​కు విషెస్​ చెబుతూ ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశాడు.

  • కుట్ర ప్రకారమే జరిగిందా?

Modi Punjab security breach: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై ఫిరోజ్​పుర్​లో కాన్వాయ్​ను అడ్డుకున్న రైతులు స్పందించారు. రోడ్డు ఖాళీ చేయించేందుకు ప్రధాని వస్తున్నారని పోలీసులు అబద్దం చెప్పి ఉంటారని భావించినట్లు వివరణ ఇచ్చారు.

  • మోదీ కోసం పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం.. పంజాబ్​ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కాన్వాయ్​ సుమారు 20 నిమిషాలపాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. అర్ధంతరంగా దిల్లీకి పయనమయ్యారు

  • బాలికలపై అత్యాచారం కేసులో కీలక తీర్పు

12 మంది బాలికలపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముగ్గురు దోషులకు శిక్షలు విధిస్తూ జిల్లా పోక్సో కోర్టు తీర్పు వెల్లడించింది. నల్గొండ జిల్లాలో 2014లో ఓ స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై అత్యాచారం జరిగింది

  • ఆయనేమైనా ప్రధాన మంత్రా?'

Guru Granth Sahib Sacrilege Case: భారీ బందోబస్తు మధ్య గురుగ్రంథ్​ సాహిబ్​ కేసు నిందితుడైన రామ్​ రహీమ్​ను పంజాబ్​ తరలించేందుకు అతను వీఐపీ ఏం కాదని వ్యాఖ్యానించింది పంజాబ్​-హరియాణా హైకోర్టు. విచారణ జరపాల్సి వస్తే రోహ్​తక్​లోని సునారియాలో జైలులో ఉన్న నిందితుడిని కలుసుకోవాలని సూచించింది.

  • పత్తి రైతు బలవన్మరణం

Farmer suicide: ఈ ఏడాది పత్తికి మంచి ధర ఉంది కానీ దిగుబడి సరిగా లేదు. దిగుబడి లేక అప్పులు తీసుకొచ్చి మరీ పత్తి సాగు చేసిన రైతులు.. అప్పులు తీర్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు తెచ్చి పత్తి సాగు చేసిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడియతండాలో చోటుచేసుకుంది.

  • బాలిక సజీవదహనం- ప్రియుడి పనే!

Teenager Burnt Alive: ఓ బాలికపై కిరోసిన్​ పోసి నిప్పంటించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలో జరిగింది. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కొందరు యువకులు ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది బాధితురాలి తల్లి

  • 'లూడో లవ్'​- బోర్డర్ క్రాస్​ చేసేలోగా...

Online Ludo Love: లూడో గేమ్​లో ఏర్పడిన పరిచయంతో సరిహద్దు దాటేందుకు సిద్ధమైంది ఓ మహిళ. ప్రియుడి సూచనలపై సరిహద్దు ప్రాంతాలకు కూడా చేరుకుంది. కానీ పోలీసులకు ఆటో డ్రైవర్​ సమాచారం ఇచ్చేసరికి ఆమె ప్లాన్​ ఫెయిలైంది. మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇంతకీ ఈ లూడో ప్రేమకథ ఎక్కడిది అంటే..

  • కిమ్ కోసం జనం.. ఏం చేశారంటే.!

North Korea rally: ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల ప్యాంగ్‌యాంగ్‌లోని కిమ్‌-2 సంగ్ స్క్వేర్‌ జన సంద్రాన్ని తలపించింది

  • మంచు లక్ష్మికి కరోనా..!

Manchu Lakshmi Coronavirus: నటి, నిర్మాత మంచు లక్ష్మి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తానే స్వయంగా వెల్లడించారు.

  • 'కపిల్​ దేవ్​కు మీరిచ్చే పెద్ద గిఫ్ట్​ అదే'

Kapil Dev Birthday: క్రికెట్​ దిగ్గజం కపిల్​ దేవ్​ పుట్టినరోజు సందర్భంగా అతడిపై ప్రశంసల జల్లు కురిపించాడు మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ నెగ్గి టీమ్ఇండియా.. కపిల్​కు బర్త్​డే గిఫ్ట్​ ఇవ్వాలని అన్నాడు. లిటిల్​ మాస్టర్​ సచిన్​ కూడా కపిల్​కు విషెస్​ చెబుతూ ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.