ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @1PM - TOPNEWS IN TELANGANA

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS
author img

By

Published : Jul 31, 2022, 12:59 PM IST

  • సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడులు..

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

  • 'సోషల్​ మీడియా అకౌంట్ల డీపీ మార్చుకోండి'..

ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్​ మీడియా ఖాతాల ప్రొఫైల్​ పిక్చర్​గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమం ఓ సామూహిక ఉద్యమంగా మారడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఉన్నారు.

  • ఆర్జీయూకేటీలో మళ్లీ విద్యార్థుల ఆందోళన..

కలుషిత ఆహారం ఘటనకు సంబంధించిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజనం చేయకుండా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు.. ఉదయం అల్పాహారమూ తినకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు.

  • పరిసరాలను శుభ్రపరిచిన మంత్రి హరీశ్​రావు

డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంత్రి తన ఇంటిలోని పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు.

  • 'హర్​ ఘర్ ​మే తిరంగా'.. చేనేత కార్మికులకు వరంగా..!

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి పండుగను తెచ్చిపెట్టాయి. ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న నిర్ణయం... నేత కార్మికుల్లో ఆనందం కలిగించింది. గతంలో బీడీలు చుట్టే కార్మికుల చేతులు.. ఇప్పుడు జాతీయ జెండాలు కుడుతున్నాయి.

  • మైనర్​పై కానిస్టేబుల్​ అత్యాచారం..

ప్రియుడిని కలిసేందుకు ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ మైనర్​కు సాయం చేస్తానని నమ్మించాడు కానిస్టేబుల్. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు భర్త, అత్తమామలు. ఈ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

  • ధరలేక నేలపాలు చేసి..

నారుపోసి.. నీరుపెట్టి.. అప్పులు తెచ్చి మరీ పంట పండించినా.. రైతుకు మిగిలింది కన్నీరే. ఎన్నో కష్టాల కోర్చి సాగు చేసిన టమాటాకు సరైన ధర దక్కకపోవడంతో ఆ అన్నదాతకు ఆవేదనే మిగిలింది. మార్కెట్‌కు తెచ్చిన సరకును కడుపు మండి పారబోయాల్సి వచ్చింది.

  • పేదోడికి మళ్లీ పట్టెడన్నం..

పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకని నిలదీసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ల నిర్వహణను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నిర్వహించిన వీటిని.. అధికారంలోకి రాగానే వైకాపా సర్కారు మూసేసింది.

  • ఆర్టీసీ వింత నిర్ణయం..

కార్గో డెలివరీలు పెంచేందుకు ఏపీఎస్​ ఆర్టీసీ తీసుకున్న వింత నిర్ణయం విమర్శలకు దారితీసింది. డోర్‌ డెలివరీ ప్రచార మాసోత్సవంలో భాగంగా ప్రతి ఆర్టీసీ ఉద్యోగి తన బంధువులు, స్నేహితులతో నెలలో తప్పనిసరిగా మూడు పార్శిళ్లు గానీ, కొరియర్లు గానీ డోర్‌ డెలివరీతో సహా బుక్‌ చేయించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంపై సంస్థ ఉద్యోగులు మండిపడుతున్నారు.

  • చెక్ బౌన్స్ కేసులో ధోనీకి ఊరట

చెక్ బౌన్స్ వివాదంలో చిక్కుకున్న టీమ్​ఇండియా మాజీ సారథి, ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ధోనీకి ఊరట లభించింది. బిహార్​లో ధోనీపై చెక్ బౌన్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ధోనీతో పాటు మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.