ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Jul 27, 2022, 6:58 AM IST

  • నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు!

Heavy Rains In Telangana: రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. బుధ, గురువారాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్దఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు నీటమునిగాయి.

  • తెలంగాణ యూనివర్సిటీలో 18 మందికి కరోనా

Corona Cases in Tenlangana University: నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. టీయూ వసతిగృహంలో ఉన్న 18 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీళ్లలో అధిక లక్షణాలున్న ముగ్గురు విద్యార్థులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మిగతా 15 మందికి వసతిగృహంలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన విద్యార్థుల్లో ఏడుగురు యువతులు కూడా ఉన్నారు.

  • రుణ సంస్థల తీరుపై కేసీఆర్​ ఫైర్​

CM KCR Fire On Loan Institutions :రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా రుణ సంస్థలు కొత్త షరతులు పెడుతుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్‌కు రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) తాజా షరతులపై సీఎం దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో మంగళవారం భేటీ నిర్వహించారు.

  • పాడి పశువుల్లోనూ తొలిసారి 'సరోగసీ' సక్సెస్​

Animals Surrogacy: రాష్ట్రంలో పాడి పశువులకు సరోగసీ విధానాన్ని అమలుచేయగా.. తొలిసారి మూడు దూడలు పుట్టాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ(ఎల్‌డీఏ), కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం.. పాడి పశువుల అభివృద్ధికి కీలక మలుపు అని ఎల్‌డీఏ సీఈఓ డా.మంజువాణి తెలిపారు.

  • విద్యార్థులకు ప్రలోభాల వల

Private Degree Colleges In Telangana:'ప్రభుత్వ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజు లేకున్నా పరీక్షల రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మా కళాశాలలో చేరితే మూడేళ్ల ఫీజు మేమే చెల్లిస్తాం. హాజరు తక్కువైనా చూసుకుంటాం. రూ.5 వేల వరకూ ఇస్తాం' అంటూ కొన్ని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు సీట్ల భర్తీ కోసం విద్యార్థులకు రకరకాల ప్రలోభాలను ఎరవేస్తున్నాయి. ప్రవేశాల కోసం పోటీపడుతున్నాయి.

  • ఉచిత హామీలు తీవ్రమైన అంశం

CJI Freebies: ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే అసంబద్ధమైన ఉచిత హామీలు తీవ్రమైనవని.. ఈ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోంది? దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

  • ఒక్క రూపాయి డాక్టర్‌' కన్నుమూత

One Rupee Doctor Passed Away: ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన వైద్యుడు సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ కన్నుమూశారు. రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

  • టీవీ డిబేట్​లో రిషి, ట్రస్‌ మాటల యుద్ధం

Rishi Sunak Liz Truss: బ్రిటన్​ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్​, లిజి ట్రస్​ మధ్య ఓ టీవీ డిబేట్​లో మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక అంశాలు, పన్ను ప్రణాళికపై ఇద్దరి మధ్య వాగ్వాదం హోరాహోరీగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎవరూ బాగా మాట్లాడారన్నదానిపై 'ఒపీనియం' సంస్థ నిర్వహించిన పోల్​లో.. సునాక్‌కు 39 శాతం ఓట్లు రాగా ట్రస్‌ వైపు 38 శాతం మంది మొగ్గారు.

  • స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌ వ్యాపిస్తుందా?

Monkeypox: ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపిస్తుందా?.. వైరస్​ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నా సోకుతుందా? కరోనా వైరస్​తో మంకీపాక్స్​ను పోల్చవచ్చా? వీటిన్నంటిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ క్లారిటీ ఇచ్చారు.

  • పెట్టుబడుల్లో తగ్గేదేలే : అదానీ

Goutam Adani Invetsments: దేశ వృద్ధితోనే తమ గ్రూప్‌ విజయం ఆధారపడి ఉంటుందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు. దేశంలో పెట్టుబడులు కొనసాగించే విషయంలో మందకొడిగా కానీ.. లేదంటే నిలిపివేయడం కానీ జరగదని స్పష్టం చేశారు. పలు విదేశీ ప్రభుత్వాలు తమ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాలకు సహాయం చేయమని కోరినందున.. విదేశాల్లోనూ విస్తరణ కోసం పునాది వేస్తున్నామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.