ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 7AM - తెలంగాణ న్యూస్ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Jun 20, 2022, 7:00 AM IST

  • అగ్నిపథ్‌ ఆగేదే లేదు

త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన 'అగ్నిపథ్‌'కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పింది. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. మునుపటి విధానం కొనసాగబోదంది. మూడు దళాలు మరో అడుగు ముందుకేసి.. అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం ఆదివారం షెడ్యూళ్లను ప్రకటించాయి.

  • ట్రిపుల్‌ఐటీలో కొలిక్కిరాని చర్చలు

బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. విద్యార్థుల ఆందోళన రాత్రంతా కొనసాగింది. విద్యార్థులతో ఆర్‌జీయూకేటీ డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ ముష్రాఫ్‌ అలీ అర్ధరాత్రి చర్చలు జరిపినా లాభం లేకపోయింది. మంత్రుల ద్వారా రాతపూర్వకంగా హామీ ఇప్పించాలని విద్యార్థులు పట్టుబట్టారు.

  • పిడుగుల పంజాకు నలుగురు బలి

పిడుగుల పంజాకు రాష్ట్రంలో నలుగురు బలయ్యారు. కుమురం భీం జిల్లాలో తల్లి, ఆరేళ్ల బాలుడు మృతి చెందగా.. పదేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి పిడుగుపాటుకు బలైంది. నిజామాబాద్‌ జిల్లాలో ఓ రైతు మరిణించాడు. ఈ మూడు ఘటనల్లో.. అందరూ పొలం పనుల్లో ఉండగానే విషాదం చోటుచేసుకుంది.

  • అపరాధ రుసుం.. యజమానులకు భారం..

వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు సంబంధించిన అపరాధ రుసుం వసూళ్ల విషయమై రవాణా శాఖ తర్జనభర్జన పడుతోంది. గడువులోపు ‘ఫిట్‌నెస్‌’ పరీక్ష చేయించని వారి నుంచి వసూలు చేయాల్సిన అపరాధ రుసుంను కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో సవరించింది. గడువు ముగిసినప్పటి నుంచి రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుంను వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఫిట్‌నెస్‌ పరీక్ష ఛార్జీలనూ భారీగా పెంచింది. చెల్లింపునకు యజమానులు నానా తంటాలు పడుతున్నారు.

  • సర్కారు చెప్పినట్టు విన్నా.. తప్పని పడిగాపులు..

అధికారులు వరి వద్దని కరాఖండీగా చెప్పారు. వేసినా కొనుగోలు చేయమన్నారు. ఆందోళన చెందిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా జొన్న సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చినా.. కొనుగోళ్లు చేపట్టక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వర్షాలు కురుస్తుండగా.. రోడ్డుపై పోసిన జొన్నలను ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మాట విని ఆరుతడి పంట వేస్తే.. ఇప్పుడు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • లైంగిక వేధింపుల నిరోధక కమిటీల పనితీరుపై పోలీసులు ఫోకస్​..

మెట్రో నగరాల్లోని పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యువతులు, వనితలపై లైంగిక వేధింపులు(సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌), బెదిరింపులను అడ్డుకొనేందుకు హైదరాబాద్‌ పోలీసులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలోనూ వేధింపుల నిరోధక కమిటీలు సమర్థంగా పనిచేస్తున్నాయా? లేదా? అని ఆరా తీస్తున్నారు.

  • ఇథియోపియాలో జాతుల ఘర్షణ.. 230 మంది ఊచకోత

ఇథియోపియా మరోమారు నెత్తురోడింది. జాతుల ఘర్షణతో అట్టుడికింది. ఈ ఘర్షణల్లో దాదాపు 230 మంది బలయ్యారు. అమ్హారా తెగకు చెందిన 200 మందికి పైగా చనిపోయారని, తాను 230 మృతదేహాల్ని లెక్కించానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దేశంలోని ఒరోమియా రీజియన్‌లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నరమేధానికి ఓ తిరుగుబాటు సంస్థే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే గురుద్వారాపై దాడి

మహమ్మద్‌ ప్రవక్తపై భారత్‌లో భాజపా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై పలు దేశాలు ఇంకా ఆగ్రహాన్ని వెల్లగక్కుతూనే ఉన్నాయి. శనివారం రోజున అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో గురుద్వారాపై జరిగిన దాడి కూడా.. ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే జరిగింది. ఈ విషయాన్ని ఇస్లామిక్​స్టేట్​ ఖొరాసాన్​ ప్రావిన్స్​ స్పష్టంచేసింది.

  • అర్ధరాత్రి కూల్చివేతలేంటి..?

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటి జోలికి వెళ్లవద్దని అధికారులను ఆదేశించింది.

  • అందం.. అక్కా చెల్లెళ్లైతే

కరీనా కపూర్‌ - కరిష్మా కపూర్‌, శిల్పాశెట్టి - శమితా శెట్టి, నగ్మ - జ్యోతిక.. ఇలా పలువురు అక్కాచెల్లెళ్లు హీరోయిన్లుగా వెండితెరపై సందడి చేశారు. అయితే ఇప్పుడీ ట్రెండ్‌ను కొనసాగిస్తూ నవతరం నాయికలూ తమ చెల్లెళ్లను రంగంలోకి దించారు. వారెవరో చూద్దాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.