ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ప్రధాన వార్తలు

TOP NEWS HEADLINES OF THE HOUR
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Aug 6, 2021, 6:00 AM IST

Updated : Aug 6, 2021, 9:49 PM IST

21:41 August 06

టాప్​ న్యూస్​ @10PM

టాప్​ న్యూస్​ @10PM 

  • సింగరేణికి ప్రశంసలు 

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి.. సింగరేణి సంస్థను అభినందిస్తూ ట్వీట్​ చేశారు. లాభాల్లో వృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.303 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా.. 2021-22లో మొదటి మూడు నెలల్లో రూ.800 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

  • అధికారుల తీరుపై సుప్రీం ఆగ్రహం

ట్రిబ్యునళ్లలో ఖాళీలపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా అధికారుల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ట్రైబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ట్రైబ్యునళ్లు ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది.

  • మోడల్​గా మారిన బామ్మ

వృద్ధాప్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతుంటారు. కానీ 99 ఏళ్ల బామ్మ.. మేకప్​ వేసుకుని మోడలింగ్ చేస్తోందంటే మీరు నమ్ముతారా? తొమ్మిది పదుల వయసులోనూ ఎంతో చలాకీగా బ్యూటీ ప్రొడక్ట్స్​కు మోడల్​గా వ్యవహరిస్తోంది. మరి ఈ వయసులో బామ్మ.. మోడలింగ్ వైపు రావటానికి గల కారణాలేంటో తెలుసుకుందామా..?

  • భారత్​కు చివరిరోజు.. పతకాలపై ఆశలు 

టోక్యో ఒలింపిక్స్​ చివరి రోజు ఆగస్టు 8 అయినప్పటికీ.. భారత్​ పోటీలు శనివారంతో ముగియనున్నాయి. మనదేశానికి మరో మూడు పతకాలు వచ్చే అవకాశముంది. శనివారం జరిగే పోటీల్లో పురుషుల జావెలిన్​ త్రో ఫైనల్లో నీరజ్​ చోప్రా ఆశలు కలిగిస్తుంటే.. రెజ్లింగ్​లో బజరంగ్​ పునియా కాంస్యం కోసం పోటీపడనున్నాడు. గోల్ఫ్​లో అదితి అశోక్​ చరిత్ర సృష్టించే అవకాశముంది. ఏ మ్యాచ్​ ఎప్పుడు జరగనుందంటే?

  • సినిమా అప్​డేట్స్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'శాకుంతలం', 'నాట్యం', 'దుర్గ', మహేష్​బాబు బర్త్​డే కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

20:42 August 06

టాప్​ న్యూస్​ @9PM

టాప్​ న్యూస్​ @9PM 

  • ఆగస్టు 16 నుంచి రుణమాఫీ

2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతు రుణమాఫీని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తిచేస్తోంది. ఈ నెల 16 నుంచి 50వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసే ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు ఈ నెల 16నుంచి... 2వేల 6 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

  • ఎక్కడా లేని విధంగా.. 

దేశంలో ఏ న‌గ‌రంలో లేని విధంగా హైద‌రాబాద్​లో మురుగునీటి శుద్ధి జ‌రుగుతుంద‌ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జలమండలి ఫతేనగర్​లో కొత్తగా నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నగరంలో జలమండలి ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీల నిర్మాణం హైదరాబాద్ నగర ప్రజల జీవనానికి సంబంధించింద‌ని మంత్రి అన్నారు. దేశంలోని ఎనిమిది ముఖ్య నగరాల్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్​లో 40 శాతం మురుగును ప్రతిరోజు శుద్ధి చేస్తున్నామ‌ని వెల్లడించారు.

  • 'జీడీపీలో 20% మేర భారత​ ఎగుమతులు'

దేశ జీడీపీలో 20శాతం మేర ఎగుమతులను భారత్​ జరిపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రానున్నరోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని చెప్పారు.

  • ఆధిక్యంలో భారత్​

నాటింగ్​హామ్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్​కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. కేఎల్​ రాహుల్​, జడేజా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్​ 4, రాబిన్సన్​ 5 వికెట్లతో రాణించారు.

  • 'బ్లాక్​లో టికెట్టు కొని చూశా..'

'బెల్​బాటమ్' ట్రైలర్ ఆవిష్కరణలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్. తాను బ్లాక్​లో టికెట్టు కొని అమితాబ్ బచ్చన్​ నటించిన 'అమర్​ అక్బర్ ఆంటోనీ (1977)' సినిమాను చూసినట్లు చెప్పుకొచ్చాడు.

19:46 August 06

టాప్​ న్యూస్​ @8PM

టాప్​ న్యూస్​ @8PM 

  • ఐటీ విభాగానికి అవార్డు

తెలంగాణ ప్రభుత్వానికి నాస్కామ్ కృత్రిమ మేధ గేమ్ ఛేంజర్ అవార్డు లభించింది.  నాస్కామ్ నిర్వహించిన 'ఎక్స్​పీరియన్స్-ఏఐ' సదస్సులో ప్రభుత్వ ఐటీ విభాగం అవార్డును కైవసం చేసుకుంది. కృత్రిమ మేధను విస్తృతంగా ఉపయోగించినందుకు గాను ఈ అవార్డు లభించింది. 

  • మంత్రి కాన్వాయ్​కు ప్రమాదం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు పెను ప్రమాదం తప్పింది. మంత్రి తన కాన్వాయ్​లో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తోన్న ట్రాక్టర్​ నుంచి ఓ కేజివిల్ చక్రం ఊడి మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.

  • తాలిబన్ల దాష్టీకం

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల హింసాత్మక ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా ఆ దేశ ప్రభుత్వం మీడియా, సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారిని హతమార్చారు.

  • సుశీల్​ భావోద్వేగం

రెండుసార్లు ఒలింపిక్​ విజేత​ సుశీల్​ కుమార్​ భావోద్వేగానికి గురయ్యాడు. టోక్యో ఒలింపిక్స్​లో 57 కిలోల విభాగంలో భారత రెజ్లర్​ రవి దహియా ఓటమి పాలయ్యాడు. దీంతో తిహార్​ జైల్లో ఉన్న సుశీల్​ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు వెల్లడించారు.

  • సైమా వేడుక.. అప్పుడే..

సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఫంక్షన్ తేదీ వచ్చేసింది. హైదరాబాద్​లోనే ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

18:43 August 06

టాప్​ న్యూస్​ @7PM

టాప్​ న్యూస్​ @7PM 

  • వైఖరేమిటో?

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ తదనంతర పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు బోర్డులు కార్యాచరణ వేగవంతం చేస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్​పై ఇంకా ఎలాంటి వైఖరి వెల్లడించలేదు.

  • 'మోదీజీ.. స్టేడియాల పేర్లూ మార్చండి..' 

రాజీవ్​ ఖేల్​రత్న పేరును మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్నగా మారుస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాల్లో మరో ఆలోచనను పంచుకున్నారు నెటిజన్లు. కేవలం అవార్డుల పేర్లే కాదు.. స్టేడియాల పేర్లు కూడా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

  • అక్టోబర్​లో కొవావాక్స్ టీకా!

'కొవావాక్స్​' కరోనా టీకాను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్​లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సంస్థ తెలిపింది. పిల్లల కోసం ఈ టీకాను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తామని చెప్పింది.

  • గొప్పగా పోరాడారు..

టోక్యో ఒలింపిక్స్​ సెమీస్​లో ఓటమి పాలైనప్పటికీ భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని తెలిపారు కోచ్​ స్జోర్డ్​ మారిజ్నే. పతకం గెలవకున్నా.. అమ్మాయిలు గొప్ప పోరాట పటిమ ప్రదర్శించారని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఈ జట్టుతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు.

  • ఫస్ట్​ లుక్​ అదుర్స్​

తమిళ నటుడు శింబు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఎప్పుడూ రొమాంటిక్, స్టైలిష్ లుక్​లో దర్శనమిచ్చే ఈ హీరో.. తొలిసారి డీ గ్లామర్​ పాత్రలో నటించనున్నారు. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో వస్తున్న 'వెందు తనిందదు కాడు' చిత్రంకోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రం ఫస్ట్​లుక్​ను మీరూ చూసేయండి.

18:13 August 06

టాప్​ న్యూస్​ @6PM

టాప్​ న్యూస్​ @6PM 

  • కన్నతల్లి కర్కశం

తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నతల్లే తన బిడ్డలను పొట్టనపెట్టుకుంది. పెంచిపోషించాల్సిన ఆ అమ్మే.. ఇద్దరి చిన్నారుల ప్రాణాలు తీసింది. ఊహ తెలియకముందే ప్రపంచానికే దూరం చేసింది. ఇద్దరు పిల్లలను తల్లే అతి గొంతు నులిమి హత్య చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది.

  • చర్చల్లో ముందడుగు

సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునే దిశగా మరో అడుగు పడింది. 12వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు గోగ్రా హైట్స్‌ ప్రాంతం నుంచి భారత్‌, చైనా బలగాలను ఉపసంహరించాయి. తమ తమ శాశ్వత స్థావరాలకు సైనికులను తరలించి గత ఏడాది మే ముందు నాటి పరిస్థితిని అక్కడ నెలకొల్పాయి. ఆగస్టు 4,5వ తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తైనట్లు భారత సైన్యం వెల్లడించింది.

  • వివాదాలకు పుల్​స్టాప్​ పెట్టేలా!

సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని అసోం, మేఘాలయ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. కేబినెట్​ మంత్రుల నేతృత్వంలోని ఈ కమిటీలు.. వివాదాలను పరిష్కరించే లక్ష్యంతో పని చేస్తాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు.

  • టీమిండియాకు ఎదురుదెబ్బ

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రాబిన్సన్​ బౌలింగ్​లో పంత్​ క్యాచ్​ ఔట్​గా పెవిలియన్​ చేరాడు. దీంతో భారత్​ 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.

  • 'క్షీరసాగర మథనం' రివ్యూ

సాఫ్ట్​వేర్​ రంగం నుంచి సినీ పరిశ్రమలో దర్శకుడిగా అడుగుపెట్టిన అనిల్ పంగులూరి రూపొందిన తొలి చిత్రం 'క్షీరసాగర మథనం'. శుక్రవారం(ఆగస్టు 6) ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా తొలి చిత్రంతో అనిల్​ విజయాన్ని అందుకున్నారా? తెలియాలంటే ఈ సమీక్ష చదివేయండి.

16:41 August 06

టాప్​ న్యూస్​ @5PM

టాప్​ న్యూస్​ @5PM 

  • సీఎం కేసీఆర్​ సమీక్ష

నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సీఎం సమావేశమయ్యారు.  కృష్ణా, గోదావరి బోర్డుల నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.  

  • ముష్కర వేట 

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. తానామండీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడం వల్ల సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

  • ఫ్లూ టీకాతో కొవిడ్​ నుంచి రక్షణ

కొవిడ్​ ప్రతికూలతలను తగ్గించే సామర్థ్యం ఇన్​ఫ్లుయెంజా(ఫ్లూ) టీకాకు(Flu Vaccine) ఉందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ఈ టీకా తీసుకున్నవారు ఐసీయుల్లో చేరే ముప్పు తక్కువేనని నిర్ధరించింది.

  • ధోనీకి 'ట్విట్టర్​' షాక్

భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి ధోనీకి ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్​ ఝలక్​ ఇచ్చింది. అతడి ట్విట్టర్​ ఖాతాకు ఉండే బ్లూ టిక్​ను తొలగించింది.

  • 'ఎస్​.ఆర్​. కల్యాణమండపం' రివ్యూ

'రాజావారు రాణిగారు' చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన కిరణ్​ అబ్బవరం.. ఆయన నటించిన రెండో చిత్రం 'ఎస్​.ఆర్​.కల్యాణమండపం' కథనూ అందించారు. ఈ సినిమా శుక్రవారం(ఆగస్టు 6) థియేటర్లలో విడుదలైంది. మ‌రీ చిత్రం ఎలా ఉంది? ఈ కథ ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకోవడానికి ఈ సమీక్ష చదివేయండి.

15:41 August 06

టాప్​ న్యూస్​ @4PM

టాప్​ న్యూస్​ @4PM 

  • భారత్​కు నిరాశ

భారత స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా.. సెమీఫైనల్లో ఓడాడు. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగం సెమీఫైనల్లో అజర్​బైజాన్​కు చెందిన అలియెవ్​ హజీ చేతిలో 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. బజరంగ్​ ఇక కాంస్య పతకం కోసం ఆడనున్నాడు. 

  • ఘోర ప్రమాదం

సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

  • ఏం చేస్తున్నారు?

న్యాయ శాఖ అధికారులకు రక్షణ కల్పించేందుకు సీబీఐ, ఐబీ చేస్తుందేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. న్యాయశాఖ అధికారులకు కల్పిస్తున్న రక్షణపై నివేదికను సమర్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది.

  • నిరసనల్లో పాల్గొన్న విపక్షాలు

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలపై రైతులు చేపట్టిన నిరసనలకు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. జంతర్​మంతర్​ వద్దకు చేరుకున్న రాహుల్​ సహా ఇతర నేతలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • మార్కెట్​ రికార్డులకు బ్రేక్​

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex today) 215 పాయింట్ల నష్టంతో 54,300 దిగువన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 56 పాయింట్లు తగ్గి 16,250 మార్క్​ కోల్పోయింది.

14:38 August 06

టాప్​ న్యూస్​ @3PM

టాప్​ న్యూస్​ @3PM 

  • రైతు బీమా నిధులు విడుదల

రైతు బీమా కోసం రూ.800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

  • 'ప్రభుత్వం ప్రగతిభవన్​కే సొంతం' 

ఎన్నికలప్పుడే ప్రభుత్వానికి అభివృద్ధి పథకాలు గుర్తుకొస్తాయని తెజస అధ్యక్షుడు కోదండ రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మంత్రి పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆచార్య జయశంకర్​ జయంతి సందర్భంగా నాంపల్లిలోని తెజస కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించారు.

  • ఆగని విపక్షాల ఆందోళన

పెగసస్​ స్పైవేర్​, రైతుల ఆందోళనలు, సాగు చట్టాలపై పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. నిరసనల మధ్యే.. రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్​సభ.

  • మహిళల జట్టుకు ప్రధాని ఫోన్​

భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ చేశారు. ఒలింపిక్స్​ కాంస్య పతక పోరులో ఓడిపోయినప్పటికీ.. మహిళలు దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పేరుపేరునా అభినందనలు తెలిపారు.

  • పోర్నోగ్రఫీ కేసులో!

అశ్లీల చిత్రాల కేసు విచారణలో భాగంగా బాలీవుడ్​ నటి షెర్లిన్​ చోప్రా.. శుక్రవారం ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసుల ఎదుట హాజరైంది. ఈ కేసులో ఇప్పటికే వ్యాపారవేత్త రాజ్​కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నారు.

14:07 August 06

టాప్​టెన్​ న్యూస్​@2PM

  • కీలక బిల్లులకు ఆమోదం

  • భారత్​కు 'ఈటా' వైరస్

కొవిడ్​ వైరస్​ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. రోజుకో రూపాన్ని ధరిస్తూ.. విస్తరిస్తోంది. బ్రిటన్​లో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్​' భారత్​కు పాకింది. మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

  • విచారణకు మరోసారి హైకోర్టు నో

 దళితబంధుపై అత్యవసర విచారణకు మరోసారి హైకోర్టు నిరాకరించింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుకోసం ప్రభుత్వం రూ.7.60కోట్లు కేటాయింపుపై అత్యవసర విచారణకు విజ్ఞప్తి చేస్తూ న్యాయస్థానంలో పిల్​ దాఖలైంది. లంచ్​మోషన్​ పిటిషన్​ దాఖలుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.

  • ఒలింపిక్స్​లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?

టోక్యో ఒలింపిక్స్​ సూపర్​గా జరుగుతున్నాయి. అన్ని దేశాల క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తూ, పతకాలు కొల్లగొడుతున్నారు. ఇందులో అన్ని క్రీడలు ఉన్నాయి కానీ క్రికెట్​కు మాత్రం ఇప్పటికీ స్థానం లేదు. అరే అవును కదా! అనుకుంటున్నారు. క్రికెట్​, ఒలింపిక్స్​లో ఎందుకు లేదో ఎప్పుడైనా ఆలోచించారా?

  • 'సూపర్‌డీలక్స్‌' ఎలా ఉందంటే?

2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకున్న తమిళ చిత్రం 'సూపర్​ డీలక్స్​'(Super Deluxe). ఈ సినిమా తెలుగు అనువాదాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' శుక్రవారం(ఆగస్టు 6) విడుదల చేసింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

12:51 August 06

టాప్​టెన్​ న్యూస్​@1PM

  • పట్టణీకరణకు పెద్దపీట... మురుగునీటి శుద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్ ఫతేనగర్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్ల వ్యయంతో 100 ఎంఎల్​డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

  • ఖేల్​రత్న పేరు మార్పు.. ఇకపై ధ్యాన్​చంద్ ఖేల్​రత్నగా!

రాజీవ్ గాంధీ ఖేల్​రత్న పేరును మార్చుతున్నట్లు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి సంబంధించి తనకు చాలా వినతులు వచ్చాయని అందువల్లే.. ఇకపై రాజీవ్ గాంధీ ఖేల్​రత్న పేరును మేజర్ ధ్యాన్​చంద్ ఖేల్​రత్న అవార్డుగా పిలవనున్నట్లు స్పష్టం చేశారు. 

  • చరిత్ర తిరగరాయడానికి అడుగు దూరంలో భారత గోల్ఫర్​!

భారత్​కు మరో పతకం ఖాయం అయ్యే అవకాశముంది. ఒలింపిక్స్​లో దూసుకుపోతున్న భారత గోల్ఫర్​ అదితి అశోక్​ రజతం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • రాజ్​కుంద్రాపై మరో నటి సంచలన ఆరోపణలు

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రా పోర్నోగ్రఫీ కేసు రోజురోజుకూ కీలక మలుపులు తీసుకుంటోంది. తాజాగా మరో నటి కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తన అనుమతి లేకుండా అశ్లీల వీడియోలు హాట్​షాట్స్ యాప్​లో విడుదల చేశారని ఆరోపించారు.

  • ఆదాయపు పన్ను లెక్క చూసుకోండి!

ఆదాయపు పన్ను చెల్లించటం ప్రతి ఒక్కరి బాధ్యత. నిబంధనల ప్రకారం మినహాయింపు లేని వారంతా తప్పకుండా రిటర్నులు దాఖలు చేయాలి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను సమర్పించేందుకు సెప్టెంబర్​ 30 చివరి తేదీ. ఈ సారి రిటర్ను దాఖలుకు రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు ఏది సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ రెండు రకాల పద్ధతుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

11:44 August 06

టాప్​టెన్​ న్యూస్​@12NOON

  • పెగసస్​పై విపక్షాల నిరసన- సభలు వాయిదా

పెగసస్​ నిఘా వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. పెగసస్​ సాఫ్ట్​వేర్​కు సంబంధించి పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. వెల్​లోకి దూసుకొచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.

  • జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్

జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్(DIKSHANT PARADE) నిర్వహించారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ హాజరయ్యారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

  • ఫ్యూచర్​ గ్రూప్, రిలయన్స్​కు షాక్

సుప్రీం కోర్టులో వ్యూచర్​ రిటైల్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్​తో ఒప్పందాన్నినిలిపివేస్తూ.. అమెజాన్​కు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

  • 'నవ భారతావనికి ఈ హాకీ వనితలు స్ఫూర్తి'

ఒలింపిక్స్​ కాంస్య పతక పోరులో భారత మహిళలు ఓడినప్పటికీ.. తమ ప్రదర్శనతో యావత్​ దేశానికి స్ఫూర్తినిచ్చారు. ఈ నేపథ్యంలో వారి ప్రదర్శనతో గర్వపడుతున్నామని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇది ముగింపు కాదని.. ప్రారంభమేనని అంటున్నారు.

  • ఆ కసి, కోపంతోనే 'రన్ రాజా రన్' స్టోరీ రాశా

'రన్ రాజా రన్'తో వెండితెరపై తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు సుజీత్. ఆ తర్వాత ప్రభాస్​తో 'సాహో' లాంటి పాన్ ఇండియా మూవీ తెరకెక్కించారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'నీకు మాత్రమే చెబుతా' కార్యక్రమంలో పాల్గొన్న సుజీత్ పలు విషయాలు పంచుకున్నారు.

10:54 August 06

టాప్​టెన్​ న్యూస్​@11 AM

  • రెపో రేటు యథాతథం: ఆర్​బీఐ

ఆర్థిక విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్​బీఐ. ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ అధ్యక్షతన ఈ నెల 4 నుంచి 3 రోజులు సమావేశమైన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ).. మూడు రోజుల సమీక్ష అనంతరం రెపో రేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

  • పోస్టుల వర్గీకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల వర్గీకరణ పూర్తి చేసింది. శాఖల్లోని పోస్టులను కేడర్ వారీగా వర్గీకరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా పోస్టుల వర్గీకరణ జరిగింది. పోస్టుల కేడర్ వర్గీకరణ ఖరారు చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 84 విభాగాధిపతులకు సంబంధించి ఉత్తర్వులు వచ్చాయి. 

  • 'ఆ శృంగారం అత్యాచారం కాదు'

మైనర్ భార్యతో భర్త శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కాదని వ్యాఖ్యానించింది అలహాబాద్​ హైకోర్టు. 15ఏళ్లుపైబడిన భార్యతో సంభోగం చేయడం ఐపీసీ సెక్షన్​ 375 కింద నేరం కాదని పేర్కొంది. ఓ కేసులో నిందితుడికి బైయిల్​ మంజూరు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

  • గ్రీన్​ కార్డు పొందే అర్హత కోల్పోనున్న లక్ష మంది!

అమెరికాలో స్థిరపడి గ్రీన్​ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న ప్రవాస ఉద్యోగులు ఆగ్రహానికి గురవుతున్నారు. గ్రీన్​ కార్డుల జారీపై బైడెన్​ బృందం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఇలాగే ఉంటే రెండు నెలల్లో లక్షకు పైగా మంది గ్రీన్​కార్డు పొందే అర్హత కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఓటీటీలో ఆ 'స్టోరీ'ల​కు ఎందుకంత క్రేజ్?​

కరోనా కారణంగా ఓటీటీల్లోనే చాలావరకు సినిమాలు, వెబ్ సిరీస్​లు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కో చిత్రం ఒక్కో కంటెంట్​తో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. అన్నింటికన్నా పొలిటికల్ స్టోరీలకు రెస్పాన్స్ బాగా వస్తోంది! వాటికే ఎందుకంత క్రేజ్? ఆ జానర్​లో వచ్చి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలేవి?

10:00 August 06

టాప్​టెన్​ న్యూస్​@10 AM

  • క్వార్టర్స్​లో భజరంగ్ విజయం.. 

భారత రెజ్లర్‌ భజరంగ్‌ పునియా అద్భుతం చేశాడు. 65కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. క్వార్టర్స్​లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాపై విజయం సాధించాడు. ఇంతకుముందు జరిగిన ప్రీక్వార్టర్స్‌లో కజక్‌స్థాన్‌కు చెందిన అక్మత్‌ అలీని 3-3 తేడాతో ఓడించాడు. వీరిద్దరి మధ్య పోరు ఫైనల్‌ను తలపించింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు.

  • దేశంలో కొత్తగా 44,643 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు గురువారంతో పోలిస్తే పెరిగాయి. కొత్తగా 44,643 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 464 మంది మరణించారు. తాజాగా 41,096 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

  • బంగారం, వెండి ధరలు ఎంతంటే..

బంగారం ధరలు(Gold price today) శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర రూ.69వేల దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

  • కేటుగాళ్లకు వరంగా మారిన 'వర్చువల్‌ నంబర్లు'!

వాళ్లు ఇక్కడి నుంచే మీకు కాల్‌ చేస్తారు. మీ మొబైల్‌ స్క్రీన్‌పై మాత్రం ఆస్ట్రేలియా.. అమెరికా.. కెనడా నంబర్‌ కనిపిస్తుంది. ఒక్కోసారి ఫ్యాన్సీ నంబర్‌ వస్తుంది. తిరిగి కాల్‌ చేస్తే కలవదు. ఇదే ‘వర్చువల్‌ నంబర్‌’. ఇప్పుడిదే కేటుగాళ్లకు వరంగా మారిందని సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీటి సాయంతో పెళ్లి పేరిట పురుషులను.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని ముంచుతున్నట్లు వివరిస్తున్నారు.

  • మహిళా హాకీ జట్టు ఓటమి..కాంస్యమూ దక్కలేదు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. కాంస్యం కోసం బ్రిటన్‌తో జరిగిన పోరులో రాణిరాంపాల్‌ సేన 3-4 తేడాతో ఓడింది. మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత అమ్మాయిలు.. కాంస్యం కోసం తీవ్రంగా శ్రమించారు.

08:54 August 06

టాప్​టెన్​ న్యూస్​@9AM

  • పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించకుండానే వెనుదిరిగింది భారత మహిళల హాకీ జట్టు. గ్రేట్ బ్రిటన్​తో జరిగిన కాంస్య పతక పోరులో 4-3 తేడాతో పోరాడి ఓడిపోయింది.

  • పెట్రో, డీజిల్ ధరల పెంపుతో.. పెరుగుతున్న ఆదాయం..

జులై నెలలో వాణిజ్య పన్నుల రాబడులు తెలంగాణ రాష్ట్రంలో భారీగా వచ్చాయి. ఏకంగా రూ.6,710 కోట్ల ఆదాయం సర్కారు ఖజానాకి చేరింది. పెట్రోల్, డీజల్ అమ్మకాలపై వాట్ రాబడి జులై నెలలో రికార్డు స్థాయిలో రూ.1100 కోట్లు రాగా.. గడిచిన నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల ద్వారా ప్రభుత్వానికి 19,527 కోట్లు ఆదాయం వచ్చింది.

  • కృష్ణాపై అనుమతుల్లేని ప్రాజెక్టులను ఆపేయాలి

కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులు లేకపోతే తక్షణం ఆపేయాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. గతనెల 15న జారీచేసిన కృష్ణా నదీ యాజమాన్య మండలి నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు.

  • క్యాబ్‌ డ్రైవర్‌ చెంప దెబ్బ ఘటనలో ట్విస్ట్‌

కొన్నిరోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​లో నడిరోడ్డుపై ఓ యువతి.. క్యాబ్​ డ్రైవర్​ను కారులోంచి లాగి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్​పై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని ట్విస్ట్​ ఇచ్చింది ఆ యువతి. సీసీటీవీ ఫుటేజ్​ చూసిన తర్వాత అసలు విషయం బయటపడింది.

  • ఆ ప్రవాస భారతీయుల సమస్యపై బైడెన్​ చర్చ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నాన్​ ఇమ్మిగ్రెంట్​ వీసాదారుల పిల్లల అంశంపై చర్చించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. తల్లిదండ్రులు ఏళ్ల తరబడి గ్రీన్​కార్డు కోసం ఎదురుచూస్తున్న క్రమంలో వారి పిల్లలు డిపెండెంట్ల హోదా కోల్పోతున్నారు. ఫలితంగా అనేకమంది భారతీయుల పిల్లలు.. దేశాన్ని వీడాలేమోనని భయపడుతున్నారు. ఈ క్రమంలో శ్వేతసౌధం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

08:00 August 06

టాప్​టెన్​ న్యూస్​@ 8AM

  • తలపడుతున్న భారత్-బ్రిటన్

రెండో క్వార్టర్ ప్రారంభంలోనే భారత జట్టు సెల్ఫ్ గోల్​తో ప్రత్యర్థి జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చుకుంది. తర్వాత దూకుడు ప్రదర్శించిన ఇండియా మూడు గోల్స్ చేసింది. దీంతో ప్రస్తుతానికి 3-2 గోల్స్ తేడాతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. 

  • దేశవ్యాప్తంగా ఒకటే నంబర్‌

అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రాచుర్యం కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలో ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. అత్యవసర ఫిర్యాదులకు ఇక డయల్‌ 100 కాదు.. 112కు ఫోన్​ చేయాలి.

  • నాణ్యమైన విద్య అందేదెప్పుడు?

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నాణ్యమైన విద్య కీలకం. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సమగ్ర విద్య అందితేనే దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తారు. దేశంలో పేరుగాంచిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పేరుకుపోయిన అధ్యాపకుల ఖాళీలను చూస్తుంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని స్పష్టం అవుతోంది.

  • 'మతి' పోగొడుతున్న కాలుష్యం!

చిన్న పాటి రేణువులుతో కూడిన కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలోని వారికి తీవ్ర మతిమరుపు వ్యాధి (డిమెన్షియా) ముప్పు అధికమని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పీఎం 2.5 రేణువులు డిమెన్షియా ముప్పును పెంచుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

  • 'పెళ్లి చూపులు'లాగా ఈ మూవీ హిట్'

దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా కె.పవన్‌ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మెరిసే మెరిసే', శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్‌శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు మొనగాళ్లు' ముందస్తు వేడుకను నిర్వహించారు. రెండు సినిమాలూ నేడు విడుదల కానున్నాయి.

06:50 August 06

టాప్​టెన్​ న్యూస్​@ 7AM

1. ఒక్కో ప్రాజెక్టుదీ ఒక్కో కథ

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాల కారణంగా... ఆయకట్టు తడవకముందే గేట్లు కొట్టుకుపోవడం, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకలేకపోవడం వంటివి జరుగుతున్నాయి. గుత్తేదార్లు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

2. 'లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయి'

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోక్‌పాల్‌ ఫిర్యాదులు తగ్గాయని, ఇది మంచి సంకేతమంటూ ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు తెలిపారు. ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌కు 2019-20లో 1,427 ఫిర్యాదులు రాగా.. ఈ సంఖ్య 2020-21 ఏడాదికి కేవలం 110కి తగ్గగా.. ప్రస్తుత ఏడాదిలో 12 మాత్రమే అందినట్లు వివరించారు.

3. వెయ్యేళ్లనాటి విగ్రహం స్వాధీనం

బంగ్లాదేశ్​కు చెందిన ఉపాధ్యాయుడి నుంచి ఆ దేశ పోలీసులు పురాతన శ్రీమహావిష్టువు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇది ఆ ఉపాధ్యాయునికి సుమారు నెలన్నర క్రితం దొరికిందని పోలీసులు తెలిపారు.

4. హాకీ స్టిక్ సింహనాదం.. 

దాదాపు 41 ఏళ్ల విరామం తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్​లో పతకం దక్కించుకుంది. వచ్చింది కాంస్యమే అయినా 'స్వర్ణం' గెలిచిన దానికంటే ఎక్కువ సంబరాలు చేసుకున్నారు అభిమానులు. ఇంతకీ హాకీ జట్టు గెలిస్తే మనకు ఎందుకింత ఉద్వేగం?

5. ఓటీటీలోనే 'టక్ జగదీష్'.. 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్'​ ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్​తో భారీ డీల్ కుదుర్చుకుందట చిత్రబృందం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

05:11 August 06

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఆశయాలు నెరవేరుస్తున్నాం

తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆచార్య జయశంకర్ సదా నిలిచే ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఆయన జీవితం అర్పించారని కొనియాడారు. 

అవే ప్రధాన కారణాలు

కృష్ణాపరివాహకంలో దిగువన కీలకమైన ప్రాజెక్టు పులిచింతల డిజైన్‌ దగ్గర నుంచి పనుల పూర్తి వరకూ అన్నింటా సమస్యలే. తొలుత 33 గేట్లు అమర్చుదామనుకున్నా ఈపీసీ సాకుచూపి 24 గేట్లతోనే సరిపెట్టారు. 

స్వాగతిస్తున్నాను

దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ డిమాండ్ చేశారు. అన్ని కులాల వృత్తుల వారికి ఒక పథకాన్ని రూపొందించాలని కోరారు. దళిత బంధు పథకాన్ని నాతోపాటు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 నేడే ఫలితాలు

ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు (10th class results) విడుదల కానున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ ఫలితాలు విడుదల చేయనున్నారు. 

మేం హాజరుకావటం లేదు

సోమవారం తలపెట్టిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం వీలు కాదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ జీఆర్ఎంబీ ఛైర్మన్​కు లేఖ రాశారు. 

ఆ హక్కుకు హామీ లభించేనా?

ఆ హక్కు హామీ లభించేనా?

కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్​డౌన్లు అనేక మందిని పేదరికంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని పలు కమిటీలు సూచిస్తున్నాయి. అదే సమయంలో పట్టణ ఉపాధి హామీ కల్పించాలని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయనం స్పష్టం చేస్తోంది.  

'వారికి ప్రయాణ ఆంక్షల విముక్తి!'

కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకున్నావారికి 'కామన్ కార్డు' అందజేయడంపై నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. టీకా తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల నుంచి విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. 

 అఖిలేశ్​​ 'మిషన్ యూపీ'

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము 400 స్థానాల్లో గెలుస్తామని సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​​ యాదవ్​ ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా భాజపా ప్రభుత్వం.. పాత ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ధరల పెరుగుదల, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన 'సైకిల్​ యాత్ర' చేపట్టారు.

'200 కోట్ల డోసుల విరాళం'

ప్రపంచదేశాలకు 200కోట్ల కరోనా టీకా డోసులను ఉచితంగా అందిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ప్రకటించారు. వీటిని ఈ సంవత్సరమే అందిస్తామని హామీ ఇచ్చారు.

 స్వర్ణం కోసం సిద్ధమవుతా

తాను రజతం కోసం టోక్యోకు రాలేదని, ఇది తనకు సంతృప్తిని ఇవ్వలేదని భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా తెలిపాడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్​లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఈ రోజు ఉగెవ్‌ జవుర్‌ సమర్థమైన రెజ్లర్ అని తెలిపాడు.

Last Updated : Aug 6, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.