ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Jul 23, 2021, 5:59 AM IST

Updated : Jul 23, 2021, 9:04 PM IST

21:03 July 23

టాప్​ న్యూస్​ @ 9PM

  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరప్రమాదం..  

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  

రాష్ట్రంలో తాజాగా 643 మందికి కరోనా వైరస్‌ (corona) సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,40,012కి చేరింది. తాజాగా మహమ్మారితో నలుగురు మృతి చెందగా మొత్తం సంఖ్య 3,778కి పెరిగింది.

  • రాజీనామాకు సిద్ధం..

ఏపీలో 'విశాఖ ఉక్కు' ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 'విశాఖ ఉక్కు' కోసం రాజీనామాకు తెదేపా ప్రజాప్రతినిధులు సిద్ధమన్నారు.

  • బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే..  

ఓవైపు మెదడులోని కణతిని తొలగించే ప్రక్రియలో వైద్యులు నిమగ్నమైతే.. మరోవైపు హనుమాన్​ చాలీసా చదువుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఓ మహిళ. శస్త్ర చికిత్స పూర్తవగానే ఏమీ జరగనట్లు తల రద్దుకుంటూ.. అటు ఇటు తిప్పుతూ.. ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చారు.

  • తేలిపోయిన భారత బ్యాట్స్​మెన్​.

శ్రీలంకతో జరుగుతోన్న మూడో వన్డేలో 225 పరుగులకే టీమ్ఇండియా ఆలౌట్​ అయ్యింది. లంక బౌలర్ల ధాటికి 43.1 ఓవర్లకే కుప్పకూలిపోయింది ధావన్​ సేన. ఫలితంగా శ్రీలంక జట్టు ఎదుట 226 రన్స్​ లక్ష్యాన్ని టీమ్ఇండియా నిర్దేశించింది.

19:49 July 23

టాప్​ న్యూస్​ @ 8PM

  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరప్రమాదం

నాగర్‌ కర్నూలు జిల్లా హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందినట్లు డీఎస్పీ నరిసింహులు తెలిపారు.

  • 60 శాతం మందిలో ​ యాంటీ బాడీలు

వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో కొవిడ్​ యాంటీ బాడీలు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతున్నట్లు ఎన్ఐఎ​న్(ICMR- NIN)​ నిర్వహించిన సీరో సర్వేలో(SERO SURVEY) తేలింది. రాష్ట్రంలో నాలుగో దఫా సీరో సర్వే నిర్వహించిన ఎన్​ఐఎన్​ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 60 శాతం మందిలో యాంటీ బాడీలను కనుగొనగా.. జాతీయ స్థాయిలో 67 శాతం మందిలో వీటిని గుర్తించామని తెలిపింది.

  • ట్విట్టర్‌ ఇండియా ఎండీకి హైకోర్టులో ఊరట

ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీశ్​ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో దాడి ఘటనకు సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఘజియాబాద్‌ పోలీసులు జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టివేసింది.

  • ఇన్​స్టాపురములో అందాల కుందనపు బొమ్మలు!

పలువురు హీరోయిన్లు వారి ఫొటోలతో నెట్టింట సందడి చేస్తున్నారు. వారెవరో చూద్దాం.

  • హైబ్రీడ్‌ ఫండ్లు.. ఎవరికి సరిపోతాయంటే?

ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలని ఉన్నా.. చాలా మంది నష్టభయం ఎక్కువగా ఉండటం వల్ల వెనక్కి తగ్గుతుంటారు. అలాంటి వారు నష్టభయం తక్కువగా ఉండే డెట్ ఫండ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ రెండింటిలోనూ ఏకకాలంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అవే హైబ్రీడ్ ఫండ్లు. మరి ఈ ఫండ్లు ఎవరికి సరిపోతాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

19:11 July 23

టాప్​ న్యూస్​ @ 7PM

  • 'మువ్వన్నెల రెపరెపలు'

టోక్యో ఒలింపిక్స్​ పరేడ్​లో 19మంది అథ్లెట్లతో పాటు ఆరుగురు అధికారులతో భారత బృందం పాల్గొంది. భారత బృందానికి.. బాక్సర్​ మేరీకోమ్​, హాకీ పురుషుల జట్టు కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​ కలిసి మువ్వన్నెల జెండాను చేతపట్టి ముందుండి నడిచారు.

  • ఆరు జిల్లాలకు రెడ్​ అలర్ట్​

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలతో సంబంధం తెగిపోయింది. ఇక రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరు జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించారు అధికారులు.

  • వరద గుప్పిట్లో ప్రజలు

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలాశయాలు నిండి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.  

  • మత్తడి దూకుతున్న చెరువులు..  

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వదలని ముసురుతో ఊళ్లన్నీ ఏరులయ్యాయి. జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు, వాగులు ఇలా నది మొదలు.. ఊళ్లో చిన్న కాలువ వరకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లన్నీ నీటమునిగితే.. కొన్ని చోట్ల పంటలు మట్టికొట్టుకుపోయాయి.  

  • సూర్య కొత్త చిత్రం 'జై భీమ్'

టాలీవుడ్ నుంచి పలు అప్​డేట్స్ వచ్చాయి. ఇందులో సూర్య కొత్త సినిమా, హన్సిక 'మహా' సెన్సార్, సత్యదేవ్ 'తిమ్మరుసు', తేజ సజ్జా 'ఇష్క్'​ ప్రమోషనల్ వీడియోకు సంబంధించిన వార్తలు ఉన్నాయి.

17:59 July 23

టాప్​ న్యూస్​ @ 6PM

  •  రాజ్యసభలో మళ్లీ హైడ్రామా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నాలుగోరోజూ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. పెగాసస్‌పై చర్చ చేపట్టాలని విపక్షసభ్యుల పట్టుపట్టడం.. మరోవైపు రాజ్యసభలో ఐటీ మంత్రి చేతిలో పత్రాలు తీసుకుని చింపేసిన టీఎంసీ ఎంపీ శంత సేన్​పై సస్పెన్షన్ వేటుతో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు

ఏపీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. examresults.ap.nic.in, bie.ap.gov.in , results.bie.ap.gov.in, results.apcfss.in వెబ్‌సైట్లలో ఫలితాలు పొందవచ్చని విద్యాశాఖ పేర్కొంది.

  • శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు.

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రా అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కుంద్రా భార్య శిల్పాశెట్టిని విచారించనున్నారు.

  • ఫ్రీగా క్రెడిట్​ స్కోర్​ తెలుసుకోండిలా..

మీరు బ్యాంకుల్లో లోన్​ లేదా క్రెడిట్​ కార్డ్ తీసుకోవాలంటే.. వారు ముందుగా చూసేది మీ క్రెడిట్​ స్కోరు. స్కోరు తక్కువగా ఉంటే.. మీకు లోన్​ ఇచ్చేందుకు బ్యాంకులు అంతగా సుముఖత చూపకపోవచ్చు. స్కోరు బాగుంటే మీ దరఖాస్తుకు వేగంగా ఆమోదం లభిస్తుంది. అంతలా ప్రభావితం చేస్తున్న ఈ క్రెడిట్​ స్కోరును(credit score check free) ఎలా తెలుసుకోవచ్చు? దీనిని ఎలా నిర్ణయిస్తారు? ఎలా దీనిని పెంచుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

  • 'ఆ వీడియోలు లీక్ చేస్తా'..

అశ్లీల వ్యాపారం కేసులో కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త రాజ్​కుంద్రాపై సంచలన ఆరోపణలు చేసింది నటి పూనమ్ పాండే. ఓ సమయంలో తనను కుంద్రా తీవ్రంగా వేధించాడని పేర్కొంది.

16:49 July 23

టాప్​ న్యూస్​ @ 5PM

  • సూపర్​ లగ్జరీ బస్సులో చెలరేగిన మంటలు

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

  • గురి తప్పని 'ఆకాశ్​'

కొత్త తరం ఆకాశ్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత్​. ప్రతికూల వాతావరణంలోనూ లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించినట్లు డీఆర్​డీఓ ప్రకటించింది. రెండు రోజుల వ్యవధిలోనే ఇది రెండో పరీక్ష.

  • చెరువులైన పొలాలు... చేపల కోసం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి వానలతో నిండుకుండల్లా మారిపోయాయి. నిజామాబాద్​ జిల్లాలో పలు చోట్ల చెరువుల్లో నీరు బయటకు రావడంతో స్థానికులు చేపల కోసం ఎగబడుతున్నారు.

  • దుమ్ము రేపిన జొమాటో

స్టాక్​మార్కెట్లు వారాంతపు సెషన్​ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 139 పాయింట్లు పెరిగి.. 52,976 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 32 పాయింట్ల వృద్ధితో 15,850 మార్క్​ను తాకింది.

  • అట్టహాసంగా ఆరంభోత్సవం

క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. టోక్యో ఒలింపిక్స్ ఆరంభోత్సం ఘనంగా ప్రారంభమైంది. జపాన్‌ జాతీయ స్టేడియంలో.. అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో జపాన్‌ చక్రవర్తి నరహిటో విశ్వక్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.

15:47 July 23

టాప్​ న్యూస్​ @4PM

  • భారీ వర్షాలకు పట్టాలు తప్పిన రైలు..

గోవాలోని ప్రఖ్యాత దూద్​సాగర్​ జలపాతం​ వద్ద రైలు ప్రమాదం జరిగింది. మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

  • మృత్యుంజయుడు..

నాలుగేళ్ల బాలుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్​ బాడ్మేర్​​ జిల్లా విష్ణు కాలనీలో జరిగింది. బాలుడు తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ వెళ్లి ఒక్కసారిగా నీళ్ల ట్రాక్టర్​ కింద పడ్డాడు.  తర్వాత ఏమైందో చూడండి.  

  • ఇలా దోశ చేయడం ఎప్పుడూ చూసుండరు!

ఆహారాన్ని విభిన్నంగా తయారు చేస్తూ దానిపై మరింత ఆసక్తి కలిగిస్తారు కొందరు షెఫ్​లు. అలా మనకు ఎంతో ఇష్టమైన దోశను.. నిప్పురవ్వలు, మంటల మధ్య చేస్తూ చూడగానే తినేయాలనే కోరిక కలిగిస్తోంది ఇందోర్​లోని ఓ రెస్టారెంట్. నెట్టింట నోరూరిస్తున్న ఈ ఫైర్​ దోశపై మీరూ లుక్కేయండి.

  • కరోనా నుంచి కోలుకున్నాక..

కరోనా నుంచి కోలుకున్న అనంతరం కాలేయంలో చీము గడ్డలు ఏర్పడిన 14 మంది తమ ఆస్పత్రిలో చేరినట్లు దిల్లీలోని సర్ గంగారామ్​ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వీరిలో 13 మందికి విజయవంతంగా చికిత్స అందించగా... ఒకరు తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

  • పోర్న్ ద్వారా వచ్చిన లాభాలు  

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రాను కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. మరికొన్ని వివరాలు సేకరించేందుకు మరో ఏడు రోజులు కస్టడీకి కోరారు. అలాగే పోర్న్ చిత్రాల ద్వారా వచ్చిన డబ్బును ఆన్​లైన్ బెట్టింగ్ కోసం రాజ్​కుంద్రా ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

14:54 July 23

టాప్​ న్యూస్​ @3PM

  • 'మహా' విషాదం- 36 మంది మృతి

మహారాష్ట్ర, రాయ్​గఢ్​ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో 36 మంది మృతిచెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

  • ఉభయసభలు సోమవారానికి వాయిదా

లోక్​సభ సోమవారానికి వాయిదా పడింది. పెగాసస్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల ఆందోళనలు కొనసాగగా... రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదా పడింది.
 
  • పాఠశాలలు పునఃప్రారంభం

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభించాలని ఆదేశించింది. ఆ రోజే రెండో విడత నాడు- నేడు పనులకు శ్రీకారం చుట్టాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ నిర్ణయించారు.

  • 10, 12వ తరగతుల ఫలితాలు

సీఐఎస్​సీఈ(కౌన్సిల్​ ఫర్​ ద ఇండియన్ స్కూల్​ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్​) 10, 12వ తరగతుల ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెలువడనున్నాయి. బోర్డు సెక్రటరీ గెర్రీ అరథూన్​ ఈమేరకు ప్రకటన విడుదల చేశారు.

  • టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​

టీమ్​ఇండియా-శ్రీలంక మధ్య జరగనున్న మూడో వన్డేలో టాస్​ గెలిచిన ధావన్​ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకోగా.. నామమాత్రమైన చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది భారత్​.

14:00 July 23

టాప్​ న్యూస్​ @2PM 

  • 'హైదరాబాద్​ అనుకూలం'

డిఫెన్స్, ఎయిరో స్పేస్ అంకుర సంస్థలకు, ఎంఎస్‌ఎంఈ(MSME)లకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు కంపెనీలు ముందుకు రావాలని కేటీఆర్ కోరారు. బెంగళూరు కంటే హైదరాబాద్‌లోనే మెరుగైన వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. టాటా బోయింగ్ హైదరాబాద్ ఫెసిలిటీలో తయారైన వందో AH- 64 అపాచి ఫ్యుజ్‌లాజ్ డెలివరీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • ఈ జాగ్రత్తలు తీసుకోండి.. 

జోరు వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. వాగులూ వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు, రైతులు విద్యుత్ పరికరాలతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పంపు సెట్ల వద్ద జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

  • నిర్బంధంలో ఎమ్మెల్యేలు 

జర్నలిస్టుపై మహిళా పోలీస్ అధికారి దాడి చేయటంపై ఒడిశా కేంద్ర్​పాడా జిల్లాలోని జర్నలిస్టులు.. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కలెక్టర్​తో సమావేశం అయ్యేందుకు వచ్చిన ఐదుగురు ఎమ్మేల్యేలను రెండు గంటల పాటు కార్యాలయంలోనే నిర్బంధించారు. మహిళా పోలీస్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • ఇది ద్రోహమే.. 

భారత్​కు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడేందుకు ప్రభుత్వం .. పెగాసస్​ స్పైవేర్​ను ఆయుధంగా ఉపయోగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు సహా అన్ని సంస్థలకు వ్యతిరేకంగా పెగాసస్​ను వినియోగించిందని విమర్శించారు. మరోవైపు.. రాహుల్​ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరి ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేయలేదని స్పష్టం చేసింది.

ఒలింపిక్స్​ విశేషాలు 

ఒలింపిక్స్​ అంటేనే వింతలు, విశేషాలు, ఆసక్తికర సంఘటనలు, రికార్డులు.. ఇలా విభిన్న అంశాలు ఉంటాయి. శుక్రవారం నుంచి (జులై 23) టోక్యో విశ్వక్రీడలు​ ప్రారంభమవుతున్న నేపథ్యంలో 1988, 1992, 1996 ఒలింపిక్స్​కు సంబంధించి ఆసక్తికర విషయాలు మీరూ తెలుసుకోండి.

12:48 July 23

టాప్​ న్యూస్​ @1PM 

  • బీమా కోసం.. ఘరానా మోసం 

బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించాడు. ఆపై రైతు బీమాకు దరఖాస్తు చేసి వచ్చిన 5 లక్షల రూపాయలను కుటుంబసభ్యులకు తెలియకుండా కాజేశాడో మోసగాడు. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌ గ్రామానికి రైతుబంధు కోఆర్డినేటర్‌ రాఘవేందర్‌ రెడ్డి ఘనకార్యం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

  • నీళ్లు అనుకుని యాసిడ్​ తాగి.. 

ఆసుపత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు పొరపాటున యాసిడ్‌ తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిజామాబాద్​లో చోటుచేసుకుంది. 

  • వరుణ బీభత్సం 

ఏకధాటి వర్షాలు.. జలమయమైన రహదారులు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వాగులు.. అలుగుపారుతున్న చెరువులు.. నిండుకుండలా మారిన ప్రాజెక్టులు.. తెలంగాణలో ఎటు చూసినా నీళ్లే కనబడుతున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వానలు.. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వరణుడి ప్రతాపం జనజీవనం అస్తవ్యస్తం చేస్తోంది.

  • ఎంపీ శంతునుపై సస్పెన్షన్​ వేటు 

గురువారం ఐటీ శాఖ మంత్రి నుంచి పత్రాలు లాక్కొని చింపివేసిన టీఎంసీ ఎంపీ శంతను సేన్​పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేయాలని భాజపా ప్రవేశ పెట్టిన తీర్మానానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరోవైపు పెగాసస్​ వ్యవహారంపై చర్చ చేపట్టాలని విపక్షాలు శుక్రవారం కూడా లోక్​సభ, రాజ్యసభలో ఆందోళనలు కొనసాగించాయి. దీంతో రెండు సభలు వాయిదా పడ్డాయి.

  • జొమాటో శుభారంభం 

స్టాక్ మార్కెట్లో జొమాటో శుభారంభం చేసింది. ఐపీఓ ఇష్యూ ధరతో పోలిస్తే.. బీఎస్​ఈలో దాదాపు 52 శాతం, ఎన్ఎస్​ఈలో దాదాపు 53 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టయ్యాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.97,500 కోట్లపైకి చేరింది.

11:46 July 23

టాప్​ న్యూస్​ @12PM 

  • మొదటి రోజు ఆదాయం ఎంతంటే?

రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన తర్వాత మొదటి రోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది. గురువారం రోజు 7,884 రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.29 కోట్ల రాబడి వచ్చింది.

  • మొదటి ప్రమాద హెచ్చరిక

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం జలాశయానికి వరద పోటెత్తింది. గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ఉద్ధృతి కారణంగా కాళేశ్వరంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

  • ఛాట్​ వెనక కోట్లు 

ఒకరు ఛాయ్‌ - సమోసా అమ్ముకునే వ్యక్తి.. మరొకరు ఛాట్‌ బండితో బతుకు బండి లాగిస్తున్న మనిషి.. ఇంకొకరు పండ్లమ్ముకుంటూ పొట్టనింపుకుంటున్న పేదవాడు..! ఇదంతా కేవలం పైకి కనిపించేదే. రోడ్ల పక్కన ఏళ్ల తరబడి చిరువ్యాపారాలు సాగిస్తున్న వీరి ఆదాయం లక్షలు, కోట్లలో ఉంది. కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉండగా.. మరికొందరికి వందల ఎకరాల్లో సాగు భూమి ఉంది. 

  • సరిహద్దులో జిన్​పింగ్​

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ అరుణాచల్​ప్రదేశ్​ సరిహద్దు సమీపాన టిబెట్​లోని ఓ పట్టణంలో అరుదైన పర్యటన చేపట్టారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని చైనా నాయకులు మాత్రమే అప్పుడప్పుడూ సందర్శించారు. ఇప్పుడు అధ్యక్షుడే అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • ముగిసిన ప్రస్థానం 

ఒలింపిక్స్​లో విశ్వవ్యాప్తంగా వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే తమ ఆటతీరుతో అభిమానులపై చెరగని ముద్ర వేస్తారు. అయితే అలాంటి ఆటగాళ్లు ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్​కు దూరమయ్యారు. వారెవరనేది మీకోసం..

10:47 July 23

టాప్​ న్యూస్​ @11AM 

  • దారుణం 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో.. భర్త గొడ్డలితో నరికిచంపాడు. కూతురుని కూడా హత్య చేశాడు.

  • నిండుకుండల్లా జలాశయాలు 

పరీవాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. శ్రీరామసాగర్‌ నుంచి మేడిగడ్డ వరకు ఉన్న ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా వస్తోండడంతో అన్ని రిజర్వాయర్లు, బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణాబేసిన్‌లో గురువారం ఆలమట్టికి ప్రవాహం పెరగడంతో నారాయణపూర్‌ నుంచి లక్షా 20వేల క్యూసెక్కులు విడుదల చేశారు. శుక్రవారానికల్లా జూరాల, శ్రీశైలానికి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

  • రెండో డోసు పరీక్షలు 

2-6 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్​ రెండో డోసు ఇవ్వటంపై ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్​ టీకాపై వచ్చేవారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఇటీవల ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు.

  • ఘోర ప్రమాదం 

పంజాబ్ మోగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.

  • సినిమా శిల్పి

టాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఆయన ప్రతి సినిమాకు పడే కష్టం ఎలాంటిదో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుచుకుంటారు. అయితే ఆయనకు జక్కన్న అని పేరు ఎవరు పెట్టారో తెలుసా?

09:48 July 23

టాప్​ న్యూస్​ @10AM 

  • నీటమునిగిన లారీ యార్డు 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌లో లారీ యార్డు నీటమునిగింది. శ్రీపాద ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో లారీ యార్డులోకి వరద చేరగా... లారీలు నీటిలో చిక్కుకున్నాయి. లారీలతో పాటు ఇటుకలు తయారుచేస్తున్న 40 మంది కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

మరోసారి డ్రోన్​ కలకలం 

జమ్ముకశ్మీర్​లో కనచక్​లో సంచరిస్తున్న ఓ డ్రోన్​ను అధికారులు కూల్చేశారు. డ్రోన్​కు అమర్చిన 5 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

  • కరోనా వ్యాప్తి తగ్గుముఖం 

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 35,342 మందికి వైరస్​(Corona Cases) సోకగా.. 38,740 మంది కోలుకున్నారు. 483 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • వరద విలయం 

భారీవర్షాల కారణంగా మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. రాయ్​గఢ్​లో వరదల కారణంగా ఐదుగురు మృతిచెందారు. వరద ప్రవాహానికి 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతంలోని 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రాయ్​గఢ్​ జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. 300 మంది చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది.

  • పతకాల వేటలో.. 

ఒలింపిక్స్​లో పతకాల వేటలో తొలిస్థానంలో ఉండేది దాదాపు అమెరికానే. ఒకటి రెండు సందర్భాల్లో చైనా కూడా ఈ గౌరవాన్ని దక్కించుకుంది. మరి ఈసారి విశ్వక్రీడల్లో తొలిస్థానం ఎవరికి దక్కనుందో చూడాలి మరి.

08:44 July 23

టాప్​ న్యూస్​ @9AM 

  • పేదలకు భారం 

అన్‌రిజర్వుడ్‌ ‘ఎక్స్‌ప్రెస్‌’ల పేరుతో రైల్వేశాఖ దోపిడీ చేస్తోంది. చిన్నస్టేషన్లలో హాల్టుల ఎత్తివేసింది. ప్రయాణ సమయం తగ్గకున్నా.. టికెట్‌ ధర రెట్టింపు అయింది. కొన్నింటికి ప్రయాణ సమయం పెరగడం గమనార్హం.

  • అదనపు కట్నం ఇవ్వలేదని.. 

అదనపు కట్నం కోసం భర్త పశువులా మారాడు. కట్టుకున్న భార్యపై తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. చివరకు భర్త చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

  • నీట మునిగిన జ్యోతిర్లింగం 

భీకర వర్షాల ధాటికి పుణెలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమశంకర ఆలయంలోకి వరదనీరు ప్రవేశించింది. దీంతో చరిత్రలో తొలిసారిగా.. శివలింగం నీట మునిగింది.

  • తొలిరోజే ఒలింపిక్​ రికార్డు 

ఒలింపిక్స్​లో భారత అథ్లెట్ల ఆట షురూ అయింది. తొలిరోజు ఆర్చర్​ మహిళా ర్యాంకింగ్స్​ పోటీలు జరిగాయి. అందులో మన ఆర్చర్ దీపికా కుమారి మెరుగైన ప్రదర్శన చేసింది. టాప్-2లో కొరియన్ అథ్లెట్లు నిలిచారు.

  • రాజమౌళి తొలిసారి అలా.. 

స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన మహేశ్​బాబుతో సినిమా చేస్తారు. దీనికోసం తన కెరీర్​లోనే తొలిసారి భిన్నమైన ప్రయత్నం చేయనున్నారు.

07:47 July 23

టాప్​ న్యూస్​ @8AM 

  • అంచనాల మేరకు ఆదాయం 

పన్నేతర రాబడిని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నేతర రాబడిగా రూ.30 వేలకోట్లను సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా... భూముల విక్రయం ద్వారానే కనీసం రూ.16 వేల కోట్ల రాబడిని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మలి విడత భూముల వేలంపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

  • నీరుగప్పిన నిర్లక్ష్యం 

వర్షాలు కురుస్తుంటే సంబురపడాల్సిన రైతులు.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగిపోవడం వల్ల తమ పంటంతా మునిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది వర్షాలకు తెగిన కట్టలకు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • 'అంతకంటే ఘోరం'

పెగాసస్​.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో బంగాల్​ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జరిగిన వాటర్​గేట్​ కుంభకోణం కంటే పెగాసస్ దారుణమైందని పేర్కొన్నారు. భాజపా తన సొంత మంత్రులు, అధికారులనే నమ్మడం లేదని విమర్శించారు.

  • టోక్యో ఒలింపిక్స్​-2020

ప్రపంచ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్​ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు వాయిదా పడ్డ విశ్వ క్రీడలు.. మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు.. ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టేస్తున్నారు. 

  • 'ఒలిం'పిక్చర్స్​

టాలీవుడ్​లో​ క్రీడా నేపథ్యంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో తెరకెక్కుతున్న చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒలింపిక్స్​ జరుగుతున్న నేపథ్యంలో వాటి గురించి ఈ ప్రత్యేక కథనం.

06:45 July 23

టాప్​ న్యూస్​ @7AM 

  • 'తేజస్​'లో భాగస్వామ్యం 

తేజస్ యుద్ధ విమానం తయారీలో ముఖ్యమైన మధ్యభాగాన్ని హైదరాబాద్‌లోని వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ విజయవంతంగా రూపొందించింది. విమానంలో అత్యంత కీలకమైన మధ్య భాగాన్ని తయారు చేయడం ఏరోస్పేస్ రంగంలో కీలక మైలురాయిగా మారనుంది. ఈ విమానాన్ని ఈ నెల 26న హెచ్‌ఏఎల్‌కు అందజేయనున్నారు.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​ 

జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ముష్కరులు హతమైనట్లు పోలీసులు తెలిపారు.

  • పెరుగుతున్న పెగాసస్​ జాబితా 

పెగాసస్​ జాబితాలో ఉన్న ప్రముఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ముఖ్య సలహాదారులతో పాటు బౌద్ధ మతాధికారుల నంబర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

  • షేర్ల నమోదు నేడే.. 

జొమాటో లిమిటెడ్‌ షేర్లు స్టాక్​ఎక్స్ఛేంజీల్లో శుక్రవారం నమోదుకానున్నాయి. ఇందుకోసం షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేసింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరును రూ.75 ప్రీమియంతో రూ.76 చొప్పున కంపెనీ కేటాయించింది.

  • హ్యాపీ బర్త్​డే సింహం 

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ బలమైన మార్కెట్ సంపాదించిన హీరో సూర్య. ఈ హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

05:17 July 23

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • ప్రారంభ వేడుకకు వేళాయెరా..

క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విశ్వ క్రీడలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న జపాన్‌ ప్రభుత్వం.. భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో.. జపాన్‌ చక్రవర్తి నరహిటో విశ్వక్రీడలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

  • కొండచరియల కింద 300 మంది!

మహారాష్ట్ర రాయ్​గఢ్​ జిల్లాలోని మహద్​ తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 300 మంది పౌరులు చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. 

  • రాష్ట్రంలో కుంభవృష్టి..

ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో గురువారం భారీ వానలు కురిశాయి. ఒకేరీతిన పడిన వానలకు జల ప్రవాహాలు పోటెత్తాయి. చెరువులు నిండుకుండల్లా మారి.. మత్తళ్లు దుంకుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • అప్పటి దాకా అప్రమత్తంగా ఉండాలి..

వచ్చే నెల 10 వరకు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజారక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో.. వరద ఉద్ధృతి దృష్ట్యా.. యుద్ధ ప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లను రాష్ట్రానికి రప్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.

  • దళిత బంధుపై సదస్సు..

రాష్ట్రంలో దళిత బంధు పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతిభవన్​లో జరగనున్న ఈ భేటీలో.. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది ఎస్సీలు పాల్గొననున్నారు.

  • పదిలో రెండు బోర్డ్​ ఎగ్జామ్స్​..

సీబీఎస్​ఈ విద్యా తరహా విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను విద్యాశాఖ పరిశీలిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం 2021-22లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై.. పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. సీబీఎస్​ఈ విధానాన్ని స్వల్ప మార్పులు చేర్పులతో రాష్ట్రంలో అమలు చేయడంపై రాష్ట్ర విద్యా పరిశోధన-శిక్షణా మండలి, ప్రభుత్వ పరీక్ష విభాగం బోర్డు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

  • ఏసీబీ వలలో తహసీల్దార్...

రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్‌ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

  • జీన్స్​ వేసుకుందని చంపేశారు..

ప్రస్తుతం జీన్స్​ అనేది సర్వసాధారణం. ఆడ, మగ అనే తేడా లేకుండా వాటిని ధరిస్తున్నారు. అయితే.. ఆ అలవాటే ఓ బాలిక పాలిట శాపమైంది. జీన్స్​, టీషర్ట్స్​ ధరించినందుకు సొంత కుంటుబ సభ్యులే హత్య చేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ దేవరియా జిల్లాలో జరిగింది.

  • కొత్తగా గామా వేరియంట్ కేసులు..

రష్యాలో డెల్టా వైరస్​తో పాటు గామా వేరియంట్ కేసులు కూడా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. తొలుత బ్రెజిల్‌లో వెలుగు చూసిన గామా వేరియంట్‌ ఇప్పుడు రష్యాకు పాకడం కలకలం సృష్టిస్తోంది. అయితే, రష్యాలో కొవిడ్‌ కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌, వ్యాక్సినేషన్‌ మందగించడమే కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు.

  • సినిమా కబుర్లు..

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'గల్లీ రౌడీ' చిత్రంలోని ఐటమ్ సాంగ్​ రిలీజై ఆకట్టుకుంటోంది. అలాగే హాలీవుడ్ యాక్షన్ ఎంటర్​టైనర్ 'గాడ్జిల్లా vs కాంగ్'​ అమెజాన్ ప్రైమ్​లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

Last Updated : Jul 23, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.