ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - తెలంగాణ వార్తలు

TOP NEWS@6AM
టాప్​న్యూస్@6AM
author img

By

Published : Oct 7, 2021, 5:55 AM IST

Updated : Oct 7, 2021, 9:54 PM IST

21:48 October 07

టాప్​ న్యూస్​ @10PM

  • ఏంటండీ కుంటిసాకులు!

ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు... హుజూరాబాద్​ ఉపఎన్నికలో నామినేషన్ల కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు 70 మంది నామినేషన్​ కోసం తరలిరాగా.. తమను నామినేషన్లు వేయనియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యక్ష ప్రశ్నలతో అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు.

  • నవంబరు 16న తెరుచుకోనున్న శబరిమల ఆలయం

భక్తుల కోసం నవంబరు 16న శబరిమల ఆలయం (Sabarimala Temple Opening) తెరుచుకోనుంది. కొవిడ్​ నేపథ్యంలో గతేడాది ఏర్పాటు చేసిన వర్చువల్​ క్యూ సిస్టమ్​ను ఈ సంవత్సరం కూడా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • సమరానికి భాజపా సన్నద్ధం

భాజపా ఆఫీస్​ బేరర్ల సమావేశం ఈ నెల 18న జరగనుంది(bjp news today). భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. జాతీయ కార్యనిర్వాహక సమావేశం వచ్చే నెలలో జరిగే అవకాశముంది.

  • రేపే రామోజీ ఫిల్మ్​ సిటీ రీఓపెన్​

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ.. పర్యటకులకు స్వాగతం పలుకుతోంది. శుక్రవారం సందర్శకుల కోసం పునఃప్రారంభం కాబోతోంది. పర్యటక స్వర్గధామం ఫిల్మ్‌సిటీలో వినోదాలను ఆస్వాదిస్తూ విహారానుభూతిని సొంతం చేసుకోవడానికి సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందించే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కసారి వీక్షించి.. మీ హాలిడేను చిరస్మరణీయంగా మలచుకోండి.

  • అదరగొట్టిన కోల్​కతా

షార్జాలో జరుగుతున్న మ్యాచ్​లో కోల్​కతా ఆకట్టుకునే బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్​కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్​లో గెలిస్తేనే కోల్​కతాకు ఫ్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి.

20:42 October 07

టాప్​ న్యూస్​ @9PM

  • వారి గర్భ విచ్ఛితికి హైకోర్టు అనుమతి

అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. 16 ఏళ్ల బాలిక 26వారాల గర్భం విచ్ఛితి కోసం పిండాన్ని తొలగించాలని కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

  • మరో దారుణం

కామారెడ్డి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. 

  • హెటిరో కార్యాలయాల్లో సోదాలు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హెటిరో డ్రగ్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థ సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

  • భారత్​-ఆస్ట్రేలియా టీ20 రద్దు

భారత్​, ఆస్ట్రేలియా మహిళాల తొలి టీ20​ రద్దయింది. ఎడతెరపిలేని వర్షం పడటం వల్ల మ్యాచ్​ను మధ్యలో నిలిపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 శనివారం జరగనుంది.

  • చిరునవ్వుకు చిరునామా మురళీమోహనం

మధ్యతరగతి మందహాసం. వెండితెరపై సామాన్యుడి అసామాన్య విజయహాసం. ఆత్మవిశ్వాసమే పెట్టుబడి. కలల కట్టుబడి. యువత వ్యక్తిత్వ వికాసానికి ఆయన నటనే ఒక బడి. కుటుంబ కథా చిత్రాల ఒరవడి. చెదరని చిరునవ్వుకు చిరునామా. ఆయన నటిస్తున్నారంటే పరిశ్రమకు ఓ ధీమా. ఏ పాత్ర లభించినా ఆత్మ అద్దినట్లు నటించిన సినీ సమ్మోహనుడే మురళీమోహనుడు.

19:46 October 07

టాప్​ న్యూస్​ @8PM

  • జపాన్​లో భారీ భూకంపం

జపాన్​లోని టోక్యోను భారీ భూకంపం వణికించింది. రిక్టర్​ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. అయితే.. సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. 

  • మరొకరు అరెస్టు 

తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కుంభకోణం కేసు(Telugu Academy FD scam case)లో మరొకరు అరెస్టయ్యారు. కొయంబత్తూరులో పద్మనాభన్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్ము కోసం పద్మనాభన్‌ నకిలీ పత్రాలు సృష్టించారు.

  • పాక్​లో భారీ భూకంపం

పాకిస్థాన్​ భూకంప ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

  • కోల్​కతా బ్యాటింగ్​

ఐపీఎల్​లో(IPL 2021 news) గురువారం(అక్టోబర్ 7) జరగనున్న రెండో మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​​, రాజస్థాన్​ రాయల్స్​​(KKR Vs RR) జట్లు తలపడనున్నాయి. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్​​.. బౌలింగ్​ ఎంచుకుంది.

  • ఆర్యన్​ఖాన్​కు జ్యూడీషియల్​ కస్టడీ

డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్​ఖాన్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించారు. అయితే అతడి తరఫు న్యాయవాదులు, బెయిల్ కోసం కోర్టులో శుక్రవారం​ పిటిషన్​ దాఖలు చేయనున్నారు.

18:50 October 07

టాప్​ న్యూస్​ @7PM

  • తెలంగాణలో భారీ పెట్టుబడులు 

రాష్ట్రంలో మరో విదేశీ సంస్థ.. భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మరో భారీ పెట్టుబడిని రాష్ట్రం ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థ అయిన ట్రిటాన్ ఈవీ.. రాష్ట్రంలో 2100 కోట్ల పెట్టుబడితో వరల్డ్ క్లాస్ ఈవీ తయారీ ప్లాంట్​ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది.

  • లఖింపుర్​కు సిద్ధూ మార్చ్​

లఖింపుర్​ ఖేరి (Lakhimpur kheri news) వెళ్లకుండా పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూను(sidhu news) నిర్బంధించారు పోలీసులు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

  • 'ఆ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయండి'

రూ.2000, రూ.500 నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు రాజస్థాన్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే భరత్​ సింగ్​ కుందనపుర్. గాంధీ ఐకానిక్ కళ్లజోడు లేదా అశోక చక్రంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • ''కొండపొలం'.. మా జీవితాల్లో అందమైన అనుభూతి'

'కొండపొలం' సినిమా విశేషాలతో పాటు షూటింగ్​లో ఎదురైన అనుభవాల్ని వైష్ణవ్​తేజ్-క్రిష్ పంచుకున్నారు. ఈ చిత్రం కోసం పవన్​ కల్యాణ్ ప్రోత్సాహం మరిచిపోలేదని క్రిష్ చెప్పారు.

  • పంజాబ్ ధమాకా

ఇప్పటికే ప్లేఆఫ్స్​కు అర్హత సాధించిన చెన్నైపై పంజాబ్​ అద్భుత విజయం సాధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్​తో పంజాబ్​కు విజయాన్ని అందించాడు.

17:48 October 07

టాప్​ న్యూస్​ @6PM

12న మరోసారి భేటీ..

ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కృష్ణా నదిపై కేంద్ర జల్‌శక్తిశాఖ గెజిట్ అమలుపై సమావేశంలో చర్చించనున్నారు. 

మరో అవినీతి ఎమ్మెర్వో..

అనిశా వలలో మరో తహశీల్దార్​ చిక్కాడు. ఆయనతో పాటు అతడి కోసమే.. అతడి మార్గంలోనే నడుస్తోన్న మరో ఇద్దరు సిబ్బంది కూడా అనిశాకు అడ్డంగా దొరికిపోయారు. తీరా దొరికిపోయాక.. మా సార్​ కోసమే పైసల్​ తీసుకున్నామంటూ.. కథలు చెప్పారు.

కేంద్రమంత్రి కొడుకుకు సమన్లు..

సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. లఖింపుర్​ ఖేరి ఘటన విచారణను వేగవంతం చేసింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేసినట్లు లఖ్​నవూ ఐజీ వెల్లడించారు. అతడిని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

తడబడిన చెన్నై బ్యాట్స్​మెన్​..

ఐపీఎల్​లో గురువారం జరుగుతోన్న తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ధోనీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగుల తక్కువ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్​(76) హాఫ్​సెంచరీతో ఆకట్టుకున్నాడు.

పృథ్వీరాజ్ కొత్త ఆడియో లీక్​

'మా' ఎన్నికలు(maa elections 2021) ఈసారి ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఇవి సినిమాలకు సంబంధించినవే అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నటుడు పృథ్వీరాజ్ ఆడియో లీక్​ కావడం చర్చనీయాంశమైంది.

16:52 October 07

టాప్​ న్యూస్​ @5PM

'కేంద్రంతో పోరాడుతాం' 

కేంద్రంపై మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr ). అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన కేంద్రంలో (Cm Kcr Speech) ఏ ప్రభుత్వం ఉన్నా పథకాల పేర్లు మాత్రమే మారుస్తారని వైఖరి మాత్రం మారదని దుయ్యబట్టారు. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతామన్నారు.

  • 'ఓట్ల కోసమే దళితబంధు'

హుజూరాబాద్​లో దళితుల తరఫున కొట్లాడతానని.. దళితులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ హామీ ఇచ్చారు. హుజూరాబాద్​ నియోజకవర్గం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భాజపా దళిత మోర్చా సమావేశంలో ఈటల రాజేందర్​ పాల్గొన్నారు.

  • కానిస్టేబుల్​ సాహసం 

సినీ ఫక్కీలో జరిగిన ఓ పోలీస్​ ఛేజ్​ సోషల్​ మీడియాలో వైరలైంది. కారులో తప్పించుకు పారిపోతున్న కిడ్నాపర్లను ఎలాగైనా పట్టుకునేందుకు ఓ కానిస్టేబుల్​ ప్రాణాలకు తెగించాడు. అతడి​ సాహసం వల్ల మూడు కిలోమీటర్ల ఛేజ్​ తర్వాత కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు.

  • స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 488 పాయింట్లు పెరిగి 59,650 పైకి చేరింది. నిఫ్టీ (Nifty Today) 144 పాయింట్ల లాభంతో 17,800లకు చేరువైంది.

  • మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో రిలీజ్

'మా' ఎలక్షన్ కోసం తమ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు మంచు విష్ణు. కళాకారుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి సొంత ఇళ్లు కటిస్తామని అన్నారు.

15:43 October 07

టాప్​ న్యూస్​ @4PM

  • 'ప్లాన్​ యువర్​ విలేజ్​' 

తాము అధికారంలోకి వచ్చాకా గ్రామపంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ (Cm Kcr Speech In Assembly) అన్నారు. అందుకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులతో గుర్తించిందని పేర్కొన్నారు.

  • భట్టి వ్యాఖ్యలకు కేసీఆర్​ కౌంటర్​

గ్రామపంచాయతీలకు కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులేమీ ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మరోసారి స్పష్టత ఇచ్చారు. పల్లె, పట్టణప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఉపాధి హామీ తదితర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించగా .. సీఎం ఖండించారు.

  • వరుణ్​-మేనకా గాంధీకి భాజపా షాక్

భాజపాలో మేనక-వరుణ్​ గాంధీల(varun gandhi news) ప్రాధాన్యం తగ్గిపోతోందా? వారిని పార్టీ అధిష్ఠానం పక్కనపెట్టిందా? ఇంత కాలం కీలక బాధ్యతలు చేపట్టిన వారిని ఇప్పుడు కమలదళం పట్టించుకోవడం లేదా? దీనికి పార్టీపై వరుణ్​ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలే కారణమా?(lakhimpur news today) భాజపా కార్యనిర్వాహక బృందంలో వారి పేర్లు లేకపోవడం వల్ల ఆ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది.

  • మలేరియాకు ఎట్టకేలకు టీకా

మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న చిన్నారుల్లో మూడింట రెండు వంతుల మంది ఆఫ్రికాలోని ఐదేళ్లలోపు చిన్నారులే. ఈ నేపథ్యంలో మలేరియా మరణాలను తగ్గించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి ముప్పు అధికంగా ఉన్న చిన్నారులకు మలేరియా టీకాను(Malaria Vaccine News) విస్తృతంగా వినియోగించేందుకు ఆమోదం తెలిపింది.

  • చెన్నై బ్యాటింగ్​

ఐపీఎల్​లో(IPL 2021 news) గురువారం(అక్టోబర్ 7) జరగనున్న తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, పంజాబ్​ కింగ్స్​ ​(CSK vs PBKS) జట్లు తలపడనున్నాయి. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన పంజాబ్​.. బౌలింగ్​ ఎంచుకుంది.

14:54 October 07

టాప్​ న్యూస్​ @3PM

  • సీనియర్లకు బాధ్యతలు 

భాజపా సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి సహా మొత్తం 80 మందితో జాతీయ కార్యనిర్వాహక బృందాన్ని(bjp national executive body) ఏర్పాటు చేసింది కమలదళం.

  • ఇద్దరు బాలికలపై ఆత్యాచారం

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగింది. చాక్లెట్ల ఆశ చూపి ఇద్దరు బాలికలపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

  • టీఎస్​ఆర్టీసీ బలోపేతానికి కృషి 

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) ప్రగతి రథచక్రాలు త్వరలోనే డబుల్ స్పీడ్​తో పరుగులు పెడతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్(Telangana Transport Minister Puvvada Ajay Kumar) ధీమా వ్యక్తం చేశారు. కార్గో, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని మెరుగుపరుచునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని కోరారు.

  • ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఐబీపీఎస్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,830 క్లర్క్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? విద్యా అర్హతలు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకోసం.

  • క్యాబ్ డ్రైవర్​తో నటి గొడవ

క్యాబ్​ డ్రైవరు(sanjjanaa galrani latest news) అపహరించాడని ఆరోపణలు చేసిన నటి సంజనా గల్రానిపై బాధిత డ్రైవరు సుసైయ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సంజనా​ చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పాడు. ఈ కంప్లెయింట్​ను పరిగణలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

13:49 October 07

టాప్​న్యూస్​@ 2PM

  • త్వరలోనే ఆ ప్రాంతాలకు నీటి సరఫరా: కేటీఆర్‌

మిషన్‌ భగీరథ పథకం కింద ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని మిలిగి ఉన్న కాలనీలకు త్వరలోనే తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో వెల్లడించారు. నగర శివారులోని నియోజకవర్గాల్లోని అనేక కాలనీల్లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

  • యోగి సర్కార్​కు సుప్రీం ప్రశ్నలు

లఖింపుర్‌ ఖేరి ఘటనలో అసలు నిందితులు ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేశారు? ఎవరిని అరెస్టు చేశారు? అనే వివరాల తెలపాలని ఉత్తర్​ప్రదేశ్​ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు లఖింపుర్‌ ఘటనపై చేపట్టిన దర్యాప్తుపై స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది.

  • పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళా టీచర్​ ఉన్నారు.

  • 'ఉగ్రవాదానికి పాకిస్థాన్​ మద్దతు'

ఉగ్రవాదానికి(Terrorism) బాధితులమనే ముసుగులో పాకిస్థాన్​ మద్దతు తెలుపుతోందని ఐక్యరాజ్య సమితి వేదికగా మరోమారు స్పష్టం చేసింది భారత్(India slams Pakistan at UN)​. ఐరాసలో కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తటంపై(kashmir issue in un) స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చింది. ముందు సొంత మైనారిటీలపై అరాచకాలను ఆపాలని హితవు పలికింది భారత్​.

  • 'కొండపొలం' సాంగ్​.. కొత్త సినిమాతో ఆది

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో వైష్ణవ్​ తేజ్​, ఆది, రష్మిక చిత్రాల సంగతులు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

12:50 October 07

టాప్​న్యూస్​@ 1PM

  • ఎవరి వాటా ఎంతంటే..?

తెలుగు అకాడమీ కేసు రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే  10మంది అరెస్టు అయ్యారు. ఏడాదికి చేయాల్సిన డిపాజిట్లను 15 రోజులకే చేసినట్లు పోలీసులు గుర్తించారు. భూపతి సాయంతో అకాడమీ నగదు బ్యాంకులకు బదిలీ చేసినట్లు గుర్తంచారు. 

  • ప్రభుత్వాధినేతగా మోదీ సరికొత్త మైలురాయి

దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ(Pm Modi News) రాత్రింబవళ్లు శ్రమించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు.. విభిన్న పథకాలతో పేదలకు మోదీ అండగా నిలిచారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు.

  • నదిలా ప్రవహిస్తోన్న లావా!

స్పెయిన్‌లోని (Spain volcano eruption 2021) లా పాల్మా దీవిలో విస్ఫోటం (Volcano Eruption today) చెందిన అగ్నిపర్వతం (la palma volcano) నుంచి లావా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. లావా ప్రవాహం ధాటికి దీవిలోని 946 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటివరకు 6000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సెప్టెంబరు 19న మొదలైన విస్ఫోటనం.. ఇంకా కొనసాగుతోంది. నిప్పులు చిమ్ముతూ.. సమీప ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది.

  • ఒకే టికెట్‌పై నాలుగు రాజమౌళి సినిమాలు!

ఒకే టికెట్​పై దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన నాలుగు సినిమాలను చూసే అవకాశం అందిస్తున్నారు! ఇంతకీ అవి ఎక్కడ ప్రదర్శించనున్నారంటే..!

  • ఆర్సీబీకి శాపంగా హైదరాబాద్.. 

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా బుధవారం సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs SRH 2021). అయితే ఇప్పటివరకు ఐపీఎల్​ చరిత్రలో ఆర్సీబీ ప్రతిసారి హైదరాబాద్​ చేతిలో కంగుతిని ప్లేఆఫ్స్ ఆశల్ని కోల్పోవడమో, టాప్​-2 నుంచి వైదొలగడమో జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం.

12:04 October 07

టాప్​న్యూస్​@ 12PM

  • జ్యువెల్లరీ దుకాణాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్​లోని శ్రీ కృష్ణ జ్యువెల్లరీ దుకాణాల్లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ సోదాలు నిర్వహించింది. శ్రీ కృష్ణ జ్యువెల్లరీ షాపులు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో  సోదాలు చేస్తున్నారు. 

  • 'నా పోరాటం ఆగదు'

లఖింపుర్​ ఖేరి ఘటనలో(Lakhimpur Kheri Incident) బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరిగేవరకు తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీ. బాధిత రైతు కుటుంబాలంతా తమకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నాయని చెప్పారు.

  • ' ఉగ్రవాదానికి పాకిస్థాన్​ మద్దతు'

  • వారికి మద్దతిస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ ఇస్తా అన్నాడు!

'మా' ఎన్నికల(MAA Elections 2021)కు సంబంధించిన 'ఆర్​ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి చేసిన ఓ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. 'మా' ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానెల్‌ సభ్యులకు ఓటు వేసిన వారికే తదుపరి సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆ దర్శకుడు చెప్పినట్లు అజయ్‌ భూపతి పేర్కొన్నారు.

  • 'డివిలియర్స్​కు పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశా '

బుధవారం రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో(SRH vs RCB) జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చివరి ఓవర్​లో బౌలింగ్ చేసిన పేసర్ భువనేశ్వర్​(bhuvneshwar kumar news) మాట్లాడాడు. డివిలియర్స్​ క్రీజులో ఉన్నప్పుడు వైడ్​ యార్కర్లు వేసేందుకే ప్రయత్నించినట్లు తెలిపాడు.

10:42 October 07

టాప్​న్యూస్​@ 11AM

  • కమీషన్ ఆశజూపి.. కోట్లు కొల్లగొట్టాడు!

అతనో పట్టభద్రుడు.. మంచి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా జీవనం సాగించవచ్చు. కానీ.. కొన్నేళ్ల నుంచి మోసాలకు అలవాటు పడ్డాడు. మాస్టర్ మైండ్​తో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ప్రతీసారి దొరికిపోతున్నా... రోజుకో కొత్త మోసానికి తెర తీస్తున్నాడు. పన్నెండేళ్ల నుంచి కాజేసిన డబ్బుతో రియల్​ ఎస్టేట్​లో పెట్టుబడులు పెట్టాడు. అది చాలదని తెలుగు అకాడమీ(Telugu Akademi Case)పై కన్నేశాడు. కమీషన్ ఇప్పిస్తానంటూ మేనేజర్లకు వల వేసి కోట్లు కాజేశాడు.

  • మానవబాంబుగా మారి.. భార్యను చంపేసిన భర్త

మిజోరంలో ఓ అసాధారణ ఘటన(Crime News today) జరిగింది. భార్యపై కోపంతో మానవబాంబుగా మారిన భర్త.. ఆమెను కౌగిలించుకుని ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దంపతులిద్దరు మరణించారు.

  • 'ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్​ ఇండియాకు పూర్వ వైభవం'

ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్​ ఇండియాకు(air india disinvestment news latest) పూర్వ వైభవం వస్తుందన్నారు ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​ జెట్ సీఎండీ అజయ్​ సింగ్​(spice jet owner). ఆరోగ్యకరమైన ఏఐతో దేశం మొత్తానికి మేలు జరుగుతుందన్నారు. బిడ్​ దాఖలు(Air India bidders list) చేసిన క్రమంలో దానిపై ఎలాంటి విషయాలు వెల్లడించలేనని చెప్పారు.

  • 'ప్రకాశ్​రాజ్​ను ఓడించి వారిని కాపాడాలి'

ప్రకాశ్​రాజ్​కు(maa elections prakashraj panel) 'మా' అసోసియేషన్​ అధ్యక్షుడయ్యే అర్హత లేదు అని సినీ నటుడు సీవీఎల్​.నరసింహారావు అన్నారు(cvl narasimha rao maa election). ప్రకాశ్​రాజ్​ ఓ వైరస్​ అని, ఆయన్ను ఓడించి తెలంగాణ బిడ్డలను గెలిపించాలని కోరారు.

  • భారీ షాట్లు ఆడనివ్వలేదు

బుధవారం సన్​రైజర్స్​ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(SRH vsRCB 2021) మధ్య జరిగిన మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్​లో తమను భారీ షాట్లు ఆడనివ్వకుండా హైదరాబాద్​ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli News). మ్యాక్స్​వెల్ రనౌట్​ కావడమే ఈ మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు. మరోవైపు.. మ్యాక్స్​వెల్​ను ఎలాగైనా ఔట్​ చేయాలని అనుకున్నట్లు విలియమ్సన్(Williamson News) తెలిపాడు.

09:47 October 07

టాప్​న్యూస్​@ 10 AM

  • కొత్త రైళ్లను నడపలేం..

స్థానికుల అవసరాల కోసం కొత్త రైళ్లు కావాలని.. ఉన్నవి పొడిగించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు రైల్వేశాఖకు వినతులు పంపగా "పొడిగించలేం.. కొత్త రైళ్లు వేయలేం.." అంటూ దక్షిణ మధ్య రైల్వే సమాధానమిచ్చింది. ఎంపీలు పంపిన 90 శాతం వినతులు కనీసం రైల్వే బోర్డుకు నివేదించకుండానే జోన్‌ స్థాయిలోనే తిరస్కరించినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో చట్టాలు చేసే వారి ప్రతిపాదనల్ని జోన్‌ స్థాయిలోనే తీసిపారేస్తే రైల్వేబోర్డుకు చేరేదెలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  • మరో 22వేల మందికి కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 22,431 మంది​కి కొవిడ్(Coronavirus update) ​​​సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి(Covid cases in India) మరో 318 మంది మృతి చెందారు.

  • రాత్రి వేళ శ్రీరామ్‌, హమీదా ముద్దు ముచ్చట్లు

బిగ్‌బాస్‌లో(bigg boss 5 telugu contestants) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్​​ రసవత్తరంగా సాగుతోంది. హౌస్​మేట్స్​ ఒకరితో మరొకరు దీటుగా పోటీపడుతున్నారు. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్​లో కంటెస్టెంట్​లు తమ టాస్క్​లను ఎలా పూర్తిచేశారంటే..

  • పెరిగిన బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర (Silver price today) మరింత ప్రియమైంది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు (Fuel price today) ఇలా ఉన్నాయి.

  • రిఫరీనే చితకబాదాడు!

మ్యాచ్​ జరుగుతుండగా ఫౌల్​ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఫుట్​బాలర్(brazilian footballer)​ రిఫరీని(Referee Football) చితక్కొట్టాడు. ఈ ఘటన బ్రెజిల్​లో జరిగింది. అనంతరం ఆ ఆటగాడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు అధికారులు.

08:47 October 07

టాప్​న్యూస్​@9AM

  • ప్రాచీన ఆలయాల పరిరక్షణకు.. 

ఊరంతా కదిలితే.. చేయి చేయి కలిపితే ఎన్నో గొప్ప పనులు కార్యరూపం దాల్చుతాయి. అలాంటి కొన్ని గ్రామాల ప్రజలు కలిసికట్టుగా కదిలి అపురూపమైన ఆలయాలను పునర్నిర్మించి కాకతీయులకు నిజమైన వారసుల్లా మారారు. వందల ఏళ్ల నాటి అద్భుతమైన ఆలయాలు శిథిలావస్థకు చేరడంతో వాటి పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఆధారపడకుండా తామే నడుం కట్టారు. ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించేందుకు(Preservation of ancient temples) తామే విరాళాలు వేసుకొని ఆలయాలను అచ్చంగా అలాగే మళ్లీ కట్టుకుంటున్నారు. శిల్ప కళావైభవానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు.

  • పంటలకు ఊతమిచ్చే అంకురాలు.. 

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కొత్త ఆలోచనలతో ఏర్పాటు చేసిన అంకుర (స్టార్టప్‌) కంపెనీలను(Agricultural Startups in Telangana) కేంద్ర వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తోంది. వీటి ఫలితాలను రైతులకు, ప్రజలకు చేర్చేలా శిక్షణ ఇవ్వాలని రాజేంద్రనగర్‌లోని జాతీయ విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్‌)కు బాధ్యతలు అప్పగించింది.

  • అమ్మ మెచ్చే నైవేద్యాలు..

దసరా (Dussehra 2021) వచ్చేస్తోంది. శరన్నవరాత్రుల్లో మహాశక్తిగా కొలిచే దుర్గామాతకు నవ నైవేద్యాలను నివేదిస్తారు. ఆరగించరమ్మని ఆహ్వానిస్తారు. అవేంటో చెబుతున్నారు విజయవాడకు చెందిన విష్ణుభట్ల పద్మావతి.

  • భారత్‌కు మిత్రుడు

ఏడాదిన్నరగా జపాన్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ప్రధానిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి నాయకుడిగానూ తనదైన ముద్ర వేసిన షింజో అబె అనారోగ్య కారణాలతో గద్దె దిగారు. జపాన్‌ వందో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఫుమియో కిషిదకు ఇంటా బయటా కఠిన సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతికి కళ్లెం వేయడం, మహమ్మారి దెబ్బకు పట్టాలు తప్పిన ఆర్థిక ప్రగతిని తిరిగి పట్టాలెక్కించడం- ఆయన ముందు ఉన్న ప్రధాన లక్ష్యాలు.

  • పాకిస్థాన్​లో భారీ భూకంపం

పాకిస్థాన్‌లో భారీ భూకంపం(earthquake in Pakistan) సంభవించింది. ఈ ఘటనలో.. 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప(earthquake news) తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొన్నారు. 

07:55 October 07

టాప్​న్యూస్​@8AM

  • స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై దసరా వేడుకలు ఆరంభం అయ్యాయి. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది.

  • 'సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నాం'

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వివిధ ఉద్యోగాల్లో గ్రూపు-ఏ పోస్టులు పొందడానికి వీలుగా సుప్రీంకోర్టే తగిన ప్రాతిపాదనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని కోరింది.

  • మరోసారి పెరిగిన చమురు ధరలు

దేశంలో చమురు ధరల (Petrol price today)​ బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

  • బాలకృష్ణ కోసం బి గోపాల్​.. 

బాలకృష్ణతో(b gopal and balakrishna) సినిమా చేసేందుకు కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు దర్శకుడు బి.గోపాల్​. ఇదివరకే బాలయ్యతో ఓ సినిమాను మొదలుపెట్టినట్లు, కానీ అది పూర్తి కాలేదని చెప్పారు. గతంలో వీరిద్దరి కాంబోలో(b gopal and balakrishna movies) 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' విడుదలై సూపర్​హిట్​గా నిలిచాయి.

  • భారత్‌ ఆధిపత్యం

హాకీ అవార్డుల్లో(FIH Awards 2021) భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని విభాగాల్లోను మన అథ్లెట్లు(Hockey India) అవార్డులు సొంతం చేసుకున్నారు. అయితే ఈ వార్షిక అవార్డుల ఎంపికలో ఎఫ్‌ఐహెచ్‌ విఫలమైందని, ఓటింగ్‌ పద్ధతి సరిగా లేదంటూ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఛాంపియన్‌ బెల్జియం(Belgium Hockey team) అసంతృప్తి వ్యక్తం చేసింది.

07:33 October 07

టాప్​న్యూస్​@7AM

  • శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తితిదే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టింది. సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణతో ఉత్సవాలను ఆరంభించింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలు జరగనున్నాయి.

  • ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత

‘సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే..’ అని వేనోళ్ల పొగిడే దేవి శరన్నవరాత్రోత్సవాలు.. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అంగరంగ వైభవంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ తగిన ఏర్పాట్లు చేశారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి అమ్మవారిని దర్శించుకొని అర్చించుకునేందుకు భక్తులు విచ్చేస్తారు. ఒక్కో ఆలయ క్షేత్రానిది ఒక్కో విశేషం. ఒకటి అర్చనల్లో, మరొకటి నైవేద్యాల సమర్పణలో, ఇంకొకటి అలంకరణలో.. ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆలయాలు చతుష్షష్టి పూజలు, పారాయణాలు, వేదమంత్రోచ్ఛారణలతో భక్తులను దృశ్యపరంగా, వినసొంపుగా అలరించనున్నాయి.

  • ఉరుముతున్న మూడో ముప్పు

కరోనా ఆంక్షలతో(Corona In India) అతలాకుతలమైన జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. మార్కెట్లలో తిరిగి సందడి నెలకొంటోంది. అయితే.. ప్రమాదం ఇంకా పొంచే ఉందంటున్న శాస్త్రవేత్తల తాజా అధ్యయనం- అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తోంది. మూడో ఉద్ధృతి(Corona Third Wave In India) ఈ నెలలోనే మొదలై వచ్చే ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్యలో తారస్థాయిని అందుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

  • అన్షు మలిక్​ రికార్డు

రెజ్లర్ అన్షు మలిక్(Anshu Malik wrestler) చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్(wrestling world championship 2021) సెమీస్​లో సొలోమియా వినిక్(ఉక్రెయిన్)పై విజయం సాధించి ఫైనల్​కు చేరిన భారత తొలి మహిళా రెజ్లర్​గా నిలిచింది.

  • ఆగిపోయిన షారుక్​ ఖాన్‌ చిత్రాల షూటింగ్‌?

మాదకద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్​ అరెస్టు కావడం బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ (Shahrukh Khan)​ చిత్రాలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్ నటిస్తున్న​ సినిమాల షూటింగ్స్​ ఆగిపోయినట్లు సమాచారం.

05:14 October 07

టాప్​న్యూస్@6AM

  • ఘనంగా బతుకమ్మ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు తొలిరోజు అట్టహాసంగా జరిగాయి. ఊరూవాడా ఉయ్యాల పాటలు మారుమోగాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చిన్నాపెద్ద సంతోషంగా ఆడిపాడారు.

  • నేడు నల్గొండకు గవర్నర్

తొలిసారి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ తమిళిసై నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్‌ వర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.

  •  ‘ఈ-ఓటింగ్‌’కు పైలెట్‌ ప్రాజెక్టుగా ఖమ్మం

పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లకుండా మొబైల్ ఫోన్ సాయంతో దేశంలోనే తొలిసారిగా తీసుకొస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం కోసం ఈ నెల 20వ తేదీన డ్రైరన్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఐటీశాఖ, సీడాక్​తో కలిసి రూపొందించిన స్మార్ట్ ఫోన్ ఆధారిత విధానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖమ్మం జిల్లాలో పరీక్షించనుంది. ఆధార్ నిర్థారిత ఎలక్ట్రానిక్ విధానంలో యాప్ సహాయంతో ఓటు వేసేలా దీన్ని రూపొందించారు

  •  మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర

పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సిలిండర్‌పై మరో రూ. 15 పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుండటంతో చాలా నగరాల్లో ‘రాయితీ’ గాల్లో కలిసిపోయింది. తాజాగా మళ్లీ ధర పెంచడంతో వినియోగదారులపై మోయలేని భారంగా మారింది.

  •  సుప్రీంకోర్టులో విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో (Lakhimpur Kheri Incident) చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది

  • 'న్యాయం జరిగే వరకు పోరాడతాం'

లఖింపుర్ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని.. కాంగ్రెస్ నేతలు రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తమకు పరిహారం వద్దు.. న్యాయం కావాలని లఖింపుర్(Lakhimpur Kheri Incident) బాధిత కుటుబాలు చెప్పాయని ప్రియాంక గాంధీ అన్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా.. రాజీనామా చేస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు.

  • వలపు వలతో కోటి కాజేశారు!

ఆన్​లైన్​లో పరిచయమైంది. అందమైన మాటలతో ముగ్గులోకి దింపింది. ప్రేమతో కవ్వించింది. వలపుతో కట్టిపడేసింది. ఆపదంటూ కన్నీరు కార్చింది. ఆదుకోమంటూ వేడుకుంది. ప్రేమకు.. పైసలకు సంబంధం లేదని నమ్మించింది. ఫస్ట్.. వెయ్యి రూపాయలతో ప్రారంభించింది.. కోటి రూపాయలు కాజేసింది! కోటి కొల్లగొట్టిన తర్వాత కానీ అర్థం కాలేదు మన సుబ్బారెడ్డికి మోసపోయానని!? క్రైం కథను తలపించే హనీ ట్రాప్​ ఏంటి? అసలేలా జరిగిందో తెలుసుకోండి...

  • పెరిగిన  ప్రయాణాలు

విమాన ప్రయాణాలు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నట్లు రేటింగ్​ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో దాదాపు 69 లక్షల మంది విమాన ప్రయాణాలు చేసినట్లు తెలిపింది. కరోనా కేసుల్లో తగ్గుదల, ఆంక్షల సడలింపుల వంటివి ఇందుకు కారణంగా పేర్కొంది.

  • విమానంలోనే మహిళ ప్రసవం..!

లండన్​ నుంచి కొచ్చిన్​కు వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానంలో ఓ మహిళ ప్రసవించింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికార వర్గాలు తెలిపాయి. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

  • బెంగళూరుపై సన్​రైజర్స్​దే విజయం

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

Last Updated : Oct 7, 2021, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.