ETV Bharat / city

Chandrababu Birthday : 73వ పడిలోకి చంద్రబాబు.. అదే నేటి నిర్ణయం

Chandrababu Birthday : తెలుగుదేశం అధినేత చంద్రబాబు 73వ పడిలో అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని భావిస్తున్న ఆయన... ఆ ప్రక్రియకు ఈ రోజే నాంది పలుకుతున్నారు. మహానాడు తర్వాత 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

Chandrababu Birthday
Chandrababu Birthday
author img

By

Published : Apr 20, 2022, 7:22 AM IST

73వ పడిలోకి చంద్రబాబు

Chandrababu Birthday: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం సీఎంగా, విపక్ష నేతగా..., నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా... తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.... ఇవాళ 73వ ఏట అడుగుపెట్టారు. గత పుట్టిన రోజులకు భిన్నంగా ఈసారి ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇందుకోసం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలగొల్లగూడెం గ్రామంలో నేడు చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు.. ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నాయకులు, కార్యకర్తల్ని కలవనున్నారు. సాయంత్రం నెక్కలంగొల్లగూడెం గ్రామానికి చేరుకుంటారు. కొందరి ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. స్థానికులతో సహపంక్తి భోజనం చేస్తారు.

ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున: పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సంసిద్ధం చేసేలా చంద్రబాబు కార్యాచరణ రూపొందించుకున్నారు. ధరల మోత, పన్నుల భారంతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాటంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ... శ్రేణులను మమేకం చేయనున్నారు. ఇవాళ పుట్టినరోజును ప్రజల మధ్య నిర్వహించుకోవడం ద్వారా... ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మే మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో పర్యటనలు మొదలుకానున్నాయి. మహానాడు తర్వాత ప్రతి నెల రెండు జిల్లాల చొప్పున... ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోడ్డు షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలా, గ్రామ సభలు నిర్వహించాలా అనే అంశంపై పార్టీ నాయకులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు.

‘బాదుడే బాదుడు’ పేరుతో: వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రజలపై వేసిన వివిధ రకాల భారాలపై ‘బాదుడే బాదుడు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి... ప్రజలకు కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు నిర్వహించాలని మొదట అనుకున్నా, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో... మహానాడు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మే నెలలో కొన్ని నియోజకవరాలకు చంద్రబాబు వెళ్లనున్నారు. మే మొదటి వారంలో కుప్పంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. చంద్రబాబు ప‌ర్యట‌న‌లకు సమాంతరంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్ కూడా ప్రజల మధ్య ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.