TNGOs On Govt Job Notification: రేపటి నుంచి ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని నెలాఖరులోపు విభజన ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కోరారు. ఉద్యోగుల విభజన రాష్ట్ర స్థాయి కమిటీ ఛైర్మన్ వికాస్‌రాజ్‌ను టీఎన్జీఓ నేతలు కలిసి ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విధివిధానాలు ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా స్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమయ్యాక జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విధివిధానాలు వస్తాయన్నారు. ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీల సంఖ్య ఇంకా పెరుగుతుందని రాజేందర్ చెప్పారు. వీలైనంత త్వరగా విభజన ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు చేపట్టాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామని, డీఏ సహా ఉద్యోగుల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు.
త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తాం. ఉద్యోగుల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం. పెండింగ్‌లో ఉన్న డీఏ ఇవ్వాలని కోరుతాం. ఉద్యోగుల విభజన పూర్తయితే ఖాళీల సంఖ్య పెరుగుతుంది. విభజన పూర్తిచేసి నియామకాలు చేపట్టాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన.
- మామిళ్ల రాజేందర్, టీఎన్జీఓ అధ్యక్షుడు.
ఇదీచూడండి: New zonal system in Telangana: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు విధివిధానాల ప్రకటన