హైదరాబాద్ సరూర్నగర్ చెరువు కింద ముంపు ప్రాంతాలను తెజస అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. కోదండరాంనగర్, సీసాల బస్తీ, పీఎన్టీ కాలనీ, కమలానగర్ ప్రాంతాల్లో పర్యటించిన కోదండరాం... వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు.
వరద బాధిత కుటుంబాలకు ఎలాంటి ప్రభుత్వ సాయం అందక పోవడం దారుణమని కోదండరాం మండిపడ్డారు. ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు వచ్చి మూడేళ్ల బాలుడు మృతి చెందగా... బాధిత కుటుంబాన్ని అధికారులు కానీ... ప్రజాప్రతినిధులు కానీ.. పలకరించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తక్షణమే ఆహారం, మంచినీరు, అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు.
ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు