ETV Bharat / city

క్లైమాక్స్​కు చేరిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారం..! - తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో తెదేపా, వైకాపా న్యూస్

తిరుపతి ఉపఎన్నిక.. ఇప్పుడు ఏపీ రాష్ట్రమంతా ఇదే చర్చ. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారంతో హీటెక్కిస్తున్నాయి. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి దూసుకెళ్తున్నాయి. అధికార.. ప్రతిపక్షాలు.. మాటల తూటాలతో దాడులు చేసుకుంటున్నాయి. నువ్వా? నేనా? అంటూ సాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది. ఇంకా కొన్నిగంటల్లోనే.. మైకులు సైలెంట్ అయిపోనున్నాయి. ఇక ఓటర్లే తమ తీర్పును ఇవ్వాల్సి ఉంది.

తిరుపతి ఉప ఎన్నిక
తిరుపతి ఉప ఎన్నిక
author img

By

Published : Apr 14, 2021, 10:36 PM IST

తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార-ప్రతిపక్షాల విమర్శలతో రాష్ట్రం మెుత్తం ఎన్నికలు జరుగుతున్నాయా? అనేలా.. హడావుడి పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులతో తిరుపతి లోక్​సభ నియోజకవర్గాన్ని మెుత్తం చుట్టేస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో... మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో 3 చిత్తూరు జిల్లాలో ఉండగా.. 4 నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ కారణంగా రెండు జిల్లాల్లోనూ రాజకీయం రసవత్తరంగా మారింది. వైకాపా ఎంపీ బల్లి దుర్గప్రసాద్​ మృతితో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక గురువారంతో ప్రచారం.. ముగియనుండటంతో ఇంకాస్త జోరు పెంచేశాయి పార్టీలు. 17న పోలింగ్ జరగనుండగా.. మే 2న ఫలితం రానుంది.

వైకాపా అభివృద్ధి మాట..

వైకాపా అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించినప్పటి నుంచి.. ప్రచార బరిలో దూసుకెళ్తోంది అధికార పార్టీ. ఎలాగైనా తమ సిట్టింగ్ సీట్​ను నిలబెట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. నవరత్నాలు అమలునే తమ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 22 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించమంటూ చెబుతోంది. వైఎస్ జగన్ పాలనను చూసి తమ అభ్యర్థికి ఓటేయాలంటూ.. ఓటర్లను అభ్యర్థిస్తోంది. ఓ వైపు షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మంత్రులు, ఎంపీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో లోక్​సభ నియోజకవర్గంలో సభలు నిర్వహించారు. తమ అభ్యర్థి 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తారని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ కూడా బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించారు. కానీ కొవిడ్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించి.. తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు బహిరంగ లేఖలు రాశారు.

భాజపా-జనసేన మేనిఫెస్టో

తిరుపతి ఉప ఎన్నికలో పొత్తుతో ముందుకెళ్తున్నాయి భాజపా-జనసేన. ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను ప్రకటించినప్పటి నుంచీ.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగానే.. ఆధ్యాత్మికం, నైపుణ్యం, ఉపాధి కల్పన, సంపూర్ణ ఆరోగ్యం, విద్య, రహదారులు, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, మత్స్యరంగం ఇలా అన్ని రంగాలను స్పృశించేలా మేనిఫెస్టోనే రూపొందించారు. భారతీయ జనతా పార్టీ జాతీ అధ్యక్షుడిని ప్రచారానికి పిలిచి వేడి పెంచేసింది. మరోవైపు పవన్ కల్యాణ్​ సైతం బహిరంగ సభ నిర్వహించారు. భాజపా శ్రేణులు మెుదటినుంచి రత్నప్రభ గెలుపు కోసం ఊరురా తిరుగుతున్నారు. వీటితో పాటు పవనే సీఎం అంటూ భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. జనసేన అధినేతపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఇమేజ్​కు తోడు ప్రత్యేక మేనిఫెస్టో కలిసివస్తోందని అభిప్రాయపడుతోంది కాషాయ దళం. మరోవైపు వైకాపా అభ్యర్థి గురుమూర్తి మతంపై భాజపా ఆరోపణలు చేస్తోంది. గురుమూర్తి అభ్యర్థిత్వంపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

పక్కా ప్లాన్​తో తెదేపా

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాగా వెయ్యాలని తెదేపా ప్లాన్ వేసింది. అందరికంటే ముందే తమ అభ్యర్థి పనబాక లక్ష్మీగా ప్రకటించింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు... తమ అభ్యర్థికే ఓటేయాలంటూ.. ఎందుకు వేయాలో ఓటర్లు వివరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో సభలు నిర్వహిస్తున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ముఖ్య నేతలంతా పనబాకకు అండగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు తెదేపా క్యాడర్ స్ట్రాంగ్​గా కౌంటర్ ఇస్తోంది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తోంది తెదేపా. ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు పోరాటం చేయటం లేదని.. 22 మంది ఎంపీలను గెలిపిస్తే.. ఏం చేశారని.. ఓటర్లకు వివరిస్తోంది. వివేకా హత్య కేసు అంశంతో పాటు వైకాపా దౌర్జన్యాలు, దాడులకు దిగుతోందని అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు విస్తృత ప్రచారం.. ఈసారి కలిసి వస్తాయని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభిప్రాయపడుతోంది.

ఉప ఎన్నిక ప్రచారంలో తెదేపా వైఎస్​ వివేకా హత్యకేసును ప్రధానంగా ప్రస్తావిస్తోంది. వివేకా కుమార్తె ఆరోపణలకు జగన్​ సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. జగన్​ బహిరంగ సభకు హాజరుకానున్నట్లు ప్రకటించిన వెంటనే... వివేకా హత్య కేసులో తనకు గానీ తమ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ప్రమాణం చేస్తానని.. జగన్​ ప్రమాణం చేస్తాడా అని నారా లోకేశ్​ సవాల్​ విసిరారు. ప్రకటించిన విధంగానే ఈరోజు లోకేశ్​ అలిపిరిలో వివేకా హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేశారు.

ఆరుసార్లు ఎంపీ.. మరోసారి!

కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ బరిలోకి ఉన్నారు. ఇక్కడినుంచి ప్రాతినిథ్యం వహించి ఆయన కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన నేత చింతా మోహనే. ఆరుసార్లు గెలిచారు. ఓసారి తెదేపా నుంచి, ఐదుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారీ తననే ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ప్రజల్లో తిరుగుతున్నారు. తాను ఎంపీగా పని చేసినప్పడు చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు. జగన్ కేసుల అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం అని చెబుతున్నారు.

పోటాపోటీగా జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక ప్రచారం రేపటితో ముగుస్తోంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచార మైకులు సైలెంట్ అయిపోనున్నాయి. ఇక ఓటర్లిచ్చే తీర్పు కోసం.. ఆశగా వేచి చూడటమే నేతల వంతు. ఇదిలావుంటే అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: 30 ఏళ్ల అనుభవం ఉన్నా అభివృద్ధి సున్నా: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.