ETV Bharat / city

Tirumala Udayasthamana Seva: శ్రీవారి ఉదయాస్తమాన టికెట్‌ ధర కోటి.. ప్రత్యేకతలు ఇవే! - Tirumala Udayasthamana Tickets

Tirumala Udayasthamana Seva: తిరుమల శ్రీనివాసుడి సేవలో తరించేందుకు.. తితిదే మరోసారి అవకాశం కల్పించింది. స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్‌ ధర.. రూ.కోటిగా నిర్ణయిస్తూ తితిదే ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం మాత్రం రూ.కోటిన్నర ఉంటుందని తెలిపింది.

Tirumala Udayasthamana Seva
Tirumala
author img

By

Published : Dec 22, 2021, 5:25 AM IST

Tirumala Udayasthamana Seva: సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు రూ.కోటి.. శుక్రవారం రోజున రూ.కోటిన్నర చేస్తూ తితిదే పాలకమండలి నిర్ణయించింది. తితిదే వద్ద 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టిక్కెట్లపై.. 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం లభిస్తోంది. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యముంటుంది.

ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల కేటాయింపుతో.. తితిదేకు సుమారుగా రూ.600 కోట్లు ఆదాయం లభించే అవకాశముంది. వీటి ద్వారా లభించే మొత్తాన్ని.. చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని.. పాలకమండలి నిర్ణయించింది. టిక్కెట్లు పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలిపారు.

ఇదీచూడండి: TTD Board Decisions: కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచాలని టీటీడీ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.