ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పని వేళలను తాత్కాలికంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి ఉదయం11.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సచివాలయం, ఉన్నతాధికారుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఈ సమయాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ మేనేజ్మెంట్ విధులు నిర్వహించే శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలకు పనివేళల్లో మార్పులు ఉండవని, వీరు గత సమయవేళల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: అత్యవసర కేసుల విచారణకు సీజేఐ మార్గదర్శకాలు