ETV Bharat / city

tiger wandering srisailam forest : శ్రీశైలం అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం - srisailam forest news

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం సమీప అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం(tiger wandering srisailam forest) కలకలం రేపింది. శ్రీశైలం వచ్చిన భక్తులకు.. రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది. వాహనదారులు తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.

tiger wandering srisailam forest
tiger wandering srisailam forest
author img

By

Published : Nov 22, 2021, 9:40 AM IST

శ్రీశైలం అటవీప్రాంతంలో పెద్దపులి కలకలం

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి సమీపంలోని నల్లమల్ల అడవిలో ఆదివారం అర్ధరాత్రి పెద్దపులి(tiger wandering srisailam forest) సంచరించింది. శ్రీశైలానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద పెద్దపులి కనిపించింది. రహదారి పక్కనున్న చెట్ల పొదల్లో ఉన్న పెద్దపులిని .. శ్రీశైలానికి వచ్చే భక్తులు, అదే మార్గంలో వెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. చెట్ల పొదల్లో ఉన్న పెద్ద పులి కాసేపటికి రోడ్డుదాటి వెళ్లిపోయింది.

  • ఇటీవల తెలంగాణలోనూ పులి సంచారం కలకలం రేపిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అవి ఎక్కడంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టేకులపల్లి అటవీ పరిధిలో పులి సంచారం(tiger wandering video) కలకలం రేపుతోంది. మెట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్‌ వద్ద పులి రోడ్డు దాటుతుండగా అటవీ సిబ్బంది, వాహనదారులు గమనించారు. మూడురోజుల క్రితం ఓ కుక్క చనిపోగా... ఆ వాసన పసిగట్టి వచ్చినట్టు గుర్తించారు. పులి తిరుగుతున్న దృశ్యాలను వాహనదారులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అటవీశాఖ సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. మరోవైపు పాల్వంచ వన్యప్రాణి అభయారణ్యం(tiger wanders in telangana) పరిధిలో లక్ష్మీదేవి మండలంలో పశువులపై(tiger attack cattle) పులి దాడి కలకలం రేపింది. ఆవులమందపై పులి దాడి చేయడంతో ఓ ఆవు మృత్యువాత పడింది. పంచాయతీ పరిధి తోకల బంధాల గ్రామానికి చెందిన గొప్ప రఘుబాబుకు కిన్నెరసాని వద్ద కొంత స్థలం ఉంది. ఆన ఎనిమిది ఆవులను అక్కడే కట్టేయగా... శుక్రవారం సాయంత్రం సమయంలో వాగు దాటి వచ్చిన పులి... ఆ ఆవులమందపై దాడి చేసింది.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతం(tiger wanders in nallamala forest)లో వటవర్లపల్లి సమీపంలోని రాసమొల్ల బావి బేస్ క్యాంపు దగ్గర మూడు రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. సోమవారం అటు వైపు వెళ్లిన పశువుల కాపరులకు కనబడటంతో తమ చరవాణిలో ఫొటోలు చిత్రీకరించారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో చిరుతపులి(leopard attack news) సంచరిస్తోంది. కల్హేర్ మండలం కృష్ణాపూర్, మనస్​పూర్ గ్రామాల శివారులో సోమవారం రాతికుచ్చపై కూర్చున్న చిరుతపులిని.. మేకల కాపరులు గమనించారు. ఆ పులిని దూరం నుంచే ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు చూసిన స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద పనులు చేస్తున్న రైతులు, కూలీలు గ్రామాల వైపు పరుగులు తీశారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి(tiger wanders) సంచరిస్తోందని కాగజ్​నగర్ ఎఫ్​డీఓ విజయ్ కుమార్ తెలిపారు. అటవీ ప్రాంతం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికుల సమాచారంతో చింతలమనేపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులను విజయ్​ కుమార్ పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.