Tiger roaming in ratipada zone: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పులిని బంధించేందుకు.. అటవీశాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. డీఈవో ఐకేవీ రాజు ఆధ్వర్యంలో 150 మంది గస్తీ కాస్తున్నారు. కాగా.. పులి సంచరిస్తున్న దృశ్యాలు ఆదివారం మరోసారి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోతులూరు సమీపంలో 80 అడుగుల గుట్టపై పులి సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పులిని బందించేందుకు మూడు బోన్లను అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. సరుగుడు పొలాల నుంచి బోన్లు తరలిస్తున్నారు. విశాఖ జంతు ప్రదర్శనశాల అధికారులూ.. పులిని బంధించేందుకు చేపట్టిన చర్యల్లో పాల్గొంటున్నారు. పులి జాడ కోసం 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టామని.. వదంతులు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ
రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం.. దిగొచ్చిన రైల్వే.. లక్షల మందికి మేలు!