ETV Bharat / city

వలస కూలీల అవస్థలు.. నేడు బిహార్‌కు మూడు రైళ్లు - migrant laborers returning to hometown from telangana

సికింద్రాబాద్‌ నుంచి బిహార్‌లోని దానాపుర్‌కు రోజూ నడిచే రైలు ఒకటే ఉండేది. వలసకార్మికుల ప్రయాణాలు ఎక్కువ కావడంతో కొంతకాలం క్రితం మరొకటి వేశారు. రెండు రైళ్లు నడుస్తున్నా టికెట్లు దొరకడం లేదు. ఆదివారం ప్రయాణానికి వీక్లీ స్పెషల్‌ రైలును ద.మ.రైల్వే ఏర్పాటుచేసింది. అందులోనూ టికెట్లు అయిపోయాయి. 16న బిహార్‌ వెళ్లేందుకు మూడు రైళ్లలోనూ రిజర్వేషన్‌ దొరక్క 541 మంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు.

migrant laborer, migrant laborer returning home
బిహార్​కు రైలు, వలస కార్మికులు, సొంతూళ్లకు వలస కార్మికులు
author img

By

Published : May 16, 2021, 7:23 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకటించిన లాక్‌డౌన్‌ వలసకార్మికులపై ప్రభావం చూపుతోంది. కొందరికి పనులు దొరకడం కష్టంగా మారడంతో సొంతరాష్ట్రాలకు పయణమవుతున్నారు. ఇప్పటికే 10 రోజుల లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా, ఆ తర్వాత కూడా పొడిగిస్తారన్న భయాలు, గత అనుభవాలు వారిని కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా వైౖపు వెళ్లే రైళ్లు పూర్తిగా నిండిపోవడంతో పాటు భారీగా వెయిటింగ్‌లిస్టు ఉంటుంది. వారం, పది రోజుల ముందు ప్రయత్నించినా టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. పనులు దొరుకుతున్నవారు మాత్రం మరికొంతకాలం వేచిచూసే ధోరణిలో ఉన్నారు.

కొన్నిరంగాలకే వెసులుబాటు

భవననిర్మాణం, మిఠాయి దుకాణాలు, రైస్‌ మిల్లులు, వుడ్‌వర్క్‌, ప్లంబింగ్‌, పెయింటింగ్‌ వంటి పనుల్లో బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీ, బెంగాల్‌, ఒడిశాకు చెందినవారే రాష్ట్రంలో ఎక్కువగా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు కొన్ని రంగాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన రంగాలకు చెందిన యజమానులు పనుల లేవని చెబుతుండటంతో కార్మికులు సొంతూరి బాట పడుతున్నారు. భవన నిర్మాణపనులకు లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు ఉంది. అయితే పెద్దపెద్ద బిల్డర్లు, కూలీలను సరఫరా చేసే పెద్దగుత్తేదారులు మాత్రమే పనుల కల్పించగలుగుతున్నారు. దీంతో పలువురు తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

స్టేషన్లలో అష్టకష్టాలు, ఆకలిబాధలు

ఉదయం రైలు ప్రయాణానికి రాత్రివేళ.. రాత్రి ప్రయాణానికి ఉదయమే రైల్వేస్టేషన్లకు వచ్చి వలసకార్మికులు నిరీక్షిస్తున్నారు. గంటలు, రోజుల తరబడి రోడ్లపై పడిగాపులు పడుతున్నారు. వీరి బాధలు చూసి దాతలు భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు.వలంటీర్‌ రమేశ్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వలస కార్మికులకు దగ్గరలోనే వంట చేయిస్తూ భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని ఓ మహిళా పోలీసు అధికారి కూడా భోజన ప్లాకెట్లు అందిస్తున్నారు.

- ‘రైస్‌ఏటీఎం’ నిర్వాహకుడు దోసపాటి రాము

పనులు ఆగిపోవడంతో..

అపార్ట్‌మెంట్లలో వుడ్‌వర్క్‌ పనిచేస్తా. నాతో పాటు మా బృందంలో 14 మంది ఉన్నాం. కొంపల్లిలో పనిచేస్తున్నాం. 40 రోజుల క్రితమే రైలు టికెట్లు తీసిపెట్టుకున్నాం. ఇబ్బందులు ఉంటే మే 15న ప్రయాణం.. పరిస్థితి బాగుంటే మాత్రం రిజర్వేషన్‌ రద్దు చేసుకుందామని అనుకున్నాం. మా భయం నిజమైంది. బిల్డర్‌ పనులు ఆపేశాడు. తర్వాత పిలుస్తానని చెప్పారు. దీంతో ఊరెళ్లిపోతున్నాం.

- సుధీర్‌రాణా, ఝార్ఖండ్‌

లాఠీ దెబ్బలు తింటున్నాం

గురువారం నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఉన్నాం. రిజర్వేషన్‌ దొరకట్లేదు. వెయిటింగ్‌లిస్టు టికెట్లతో ఓ మూల కూర్చోనైనా వెళదామని ప్రయత్నిస్తే స్టేషన్‌లోపలికి రానీయడం లేదు. రిజర్వేషన్‌ కోసం ప్రతిరోజూ ప్రయత్నిస్తున్నాం. రాత్రిపూట పోలీసులు కొడుతున్నారు. కొండాపూర్‌ ప్రాంతంలో ఇళ్లపై నీటి ట్యాంకులు బిగించే పనిచేస్తున్నాం. స్టేషన్‌ పరిసరాల్లో పడుకుంటూ.. దాతలిచ్చే భోజనం తింటున్నాం.

-లల్లూపాశ్వాన్‌, బిహార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.