మామూలుగా ఎక్కడ చూసినా గొర్రెలకు బెత్తెడు తోకే ఉంటుంది. కానీ ఏపీలోని శ్రీకాకుళంలో మూరెడు కంటే ఎక్కువే తోక ఉన్న గొర్రెలున్నాయి. మామూలు గొర్రెలతో పాటు ఇవి కూడా.. పచ్చిక మేస్తూ కనిపించాయి. అంతేకాకుండా.. వీటికి కొమ్ములు లేవు. పొడవైన చెవులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ గొర్రెలు సాధారణ గొర్రెల కన్నా ఎక్కువ బరువు కలిగి ఉన్నాయి. వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. వారపు సంతల్లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. మాంసం వ్యాపారులు ఈ గొర్రెలను అధికంగా కోనుగోలు చేస్తున్నారు. వీటిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన గొర్రెలుగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఈశ్వరరావు తెలిపారు. సరికొత్తగా ఉన్న ఈ గొర్రెలను చూసేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నారు.