రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులతో పాటు వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
రేపు రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, జనగామ, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.