స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వివిధ జైళ్లలోని 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో జైళ్లలో ఏళ్లుగా మగ్గుతున్న ఖైదీల్లో ఆశలు రేగాయి. తమ వారు పంద్రాగస్టు సందర్భంగా సోమవారం విడుదలవుతారనే ఆశతో ఖైదీల కుటుంబసభ్యులు ఆయా జైళ్ల ముందు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు. రాత్రి 10.30 గంటలు దాటినా వారు కారాగారాల నుంచి బయటకు రాకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ రాజేష్‌ని సంప్రదించగా.. ఖైదీల విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు తమకు చేరలేదని తెలిపారు.
ఇవీ చదవండి: