ETV Bharat / city

Group-1 and Group-2 posts: గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి పచ్చజెండా..

Group-1 and Group-2 posts: ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 110 గ్రూప్‌-1 పోస్టులు, 182 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది.

గ్రూప్‌1, గ్రూప్‌2 పోస్టుల భర్తీకి పచ్చజెండా..

author img

By

Published : Apr 1, 2022, 2:57 PM IST

Group-1 and Group-2 posts: డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 292 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 110 గ్రూప్‌-1 పోస్టులు, 182 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది.

డిప్యూటీ కలెక్టర్లు, సీటీవోలు, జిల్లా రిజిస్ట్రార్‌లు, డీఎస్పీ పోస్టులతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు తదితర పోస్టులను గ్రూప్‌-1 కేటగిరీలో, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, సహకార సొసైటీల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు, సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు గ్రూప్‌-2 కేటగిరీలో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి: Recruitment: ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు.. ఆ రెండు శాఖల్లోనే అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.