పాత లెక్కల్లో 52..
గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు మేయర్ ఎన్నికలో పాల్గొనే హక్కుంది. కార్పొరేటర్లతోపాటు బరిలోని అభ్యర్థులకు మద్దతు ఇవ్వొచ్ఛు గతేడాది అక్టోబరు వరకు జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 52 మంది ఎక్స్‌అఫీషియోలు ఉన్నారు. హోదాల వారీగా చూస్తే..
- లోక్‌సభ సభ్యులు - అయిదుగురు(రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి),
- రాజ్యసభ సభ్యులు - 2 (కేకే, డి.శ్రీనివాస్),
- ఎమ్మెల్సీలు - 20 (1-స్వతంత్ర, 2-ఎంఐఎం, 1-భాజపా, 11-తెరాస, 5-గవర్నర్ కోటా
(తెరాస- భూపాల్‌రెడ్డి, సుంకరి రాజు, సతీష్‌కుమార్, మహమూద్‌అలీ, నారాయణరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎంఎస్ ప్రభాకర్‌రావు, లక్ష్మణ్‌రావు, ఎగ్గె మల్లేశం, నవీన్‌కుమార్; ఎంఐఎం-అమీన్ ఉల్ జాఫ్రీ, మిర్జా రియాజ్ ఉల్ హసన్; భాజపా-రాంచందర్‌రావు; గవర్నర్ కోటా - శ్రీనివాస్‌రెడ్డి, దర్‌పల్లి రాజేశ్వర్‌రావు, దయానంద్, గోరటి వెంకన్న, సారయ్య; స్వతంత్ర - జనార్ధన్‌రెడ్డి)
- ఎమ్మెల్యేలు - 25 (7-ఎంఐఎం, 1-భాజపా, 17- తెరాస, 1-నామినేటెడ్).. వీరిలో పలువురు ఇప్పటికే ఇతర స్థానిక సంస్థల్లో ఓటు వినియోగించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిశీలన తర్వాత స్పష్టత రానుంది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఇవ్వొద్దని మరో కేసు నమోదైందని, ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చ జరుగుతోందని వివరించారు.
ఇవీ చూడండి: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల