ETV Bharat / city

baby died: అదృశ్యమైన చిన్నారి.. నీటి తొట్టెలో శవమై..!

హైదరాబాద్‌ మియాపూర్‌లో విషాదం జరిగింది. ఆదివారం సాయంత్రం అదృశ్యమైన చిన్నారి మృతిచెందింది. ఇంటి సమీపంలోని ఖాళీస్థలంలో మృతదేహం లభించింది. చిన్నారి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక హత్య చేశారన్న కోణంలో విచారిస్తున్నారు.

The missing child was found dead in a tub of water
అదృశ్యమైన చిన్నారి.. నీటి తొట్టెలో శవమై..
author img

By

Published : Sep 13, 2021, 4:19 PM IST

పాల బుగ్గల పసిప్రాయం.. మాటలు తిరగని.. నడకలు నేర్వని.. బోసి నవ్వుల 13నెలల పసితనం.. ఇంతలోనే విషాదం. ఊహించని ప్రమాదం. నవ్వులతో కనిపించే చిన్నారి.. తొట్టెలో మృతదేహమై కనిపించింది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మిస్టరిగా మారిన చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ మియాపూర్‌లో ఆదివారం సాయంత్రం నుంచి కన్పించకుండా పోయిన 13నెలల చిన్నారి ఘటన విషాదాంతమైంది. ఇంటి సమీపంలోని ఖాళీస్థలంలో సోనీ మృతదేహం లభ్యమైంది. కర్నూలు జిల్లా ముత్తుకూరుకు చెందిన చిన్నారి తల్లిదండ్రులు చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. నిన్న పనులకు వెళ్తూ బాలికను చూసుకోమని పక్కింటి వారికి చెప్పివెళ్లారు. ఇంటికి తిరిగొచ్చేసరికి పాప కన్పించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సహాయంతో రాత్రంతా చిన్నారి కోసం వెతికిన పోలీసులు.... ఇంటీ సమీపంలో మృతదేహం గుర్తించారు.

రాత్రి లేదు... ఉదయం అక్కడికి ఎలా వచ్చింది?

పోలీసులతో కలిసి రాత్రంతా వెతికిన మెుదట పాప ఆచూకీ లభించలేదని.... ఇవాళ ఉదయం మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. చిన్నారి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు.

అనుమానాలున్నాయి..!

ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోనీ కుటుంబ సభ్యుల్లో ఒకరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతదేహంపై బట్టలు తడిచి ఉన్నాయని...నీటిలో ముంచి హత్య చేసినట్టు భావిస్తున్నారు. చిన్నారి మృతికి సంబంధించి త్వరలోనే నిజానిజాలు వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

ఉదయం 6గంటల సమయంలో మృతి చెందిన బాలిక అమ్మమ్మ.. పక్కన ఉన్న రాజు అనే వ్యక్తి వాళ్ల ఇంటి పక్కన శవం ఉన్నట్లు చూపించింది. బాలిక తడిబట్టలతో ఉంది. చిన్నారిని బయటకు తీసి ఒత్తితే నీళ్లు వచ్చాయి. మృతదేహంలో నీళ్లు ఎక్కవగా తాగినట్లు తెలుస్తుంది. మృతదేహం లభించిన విధానం చూస్తే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పడేసినట్లుగా ఉంది. ఏ విధంగా ఇది జరిగింది.. ఎక్కడ జరిగింది?, ఎవరు తీసుకొచ్చి అక్కడ వేశారు? కారణాలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. మృతురాలి కుటుంబీకులపై కూడా కొంత అనుమానం చూపిస్తున్నారు.-వెంకటేశ్‌, మియాపూర్‌ సీఐ

ఇదీ చూడండి: ‘నల్లధనం’ కేసులో వెలుగులోకి విస్తుపోయే అంశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.