Ministers on Paddy Procurement: యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ పూర్తి కావడంతో పాటు బియ్యం తీసుకునే విషయంలో భారత ఆహారసంస్థ(ఎఫ్.సి.ఐ.) నిర్ణయం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ధాన్యం సేకరణపై మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ బీఆర్కే భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సమీక్షించిన మంత్రులు... పూర్తి వివరాలు, సంబంధిత సమాచారంతో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమీక్ష నిర్వహిస్తారని, అందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. అటు ఎఫ్.సి.ఐ. బియ్యం తీసుకోపోతే ఏం చేయాలన్న విషయమై కూడా సమావేశంలో చర్చించారు. అయితే ఎఫ్.సి.ఐ. తీసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాధారణ బియ్యంగా మారిస్తే వచ్చే వ్యత్యాసానికి సంబంధించిన టెస్ట్ మిల్లింగ్ అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. టెస్ట్ మిల్లింగ్ కొనసాగుతోందని, పూర్తైతే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: