ETV Bharat / city

కౌంటర్ల దాఖలులో ఇంత నిర్లక్ష్యమా, ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి - తెలంగాణ హైకోర్టు

Telangana HC on GO 111 జీవో 111 విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్​ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ పిటిషన్​ దాఖలై 15 ఏళ్లు గడుస్తున్న ఇంకా ఈ ఆలస్యం ఏంటి అని ప్రశ్నించింది. చివరిగా ఈ ఒక్కసారికి గడువు ఇస్తున్నామంటూ విచారణను వాయిదా వేసింది.

telangana high court
తెలంగాణ హైకోర్టు
author img

By

Published : Aug 23, 2022, 8:09 AM IST

Telangana HC on GO 111 : హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణ నిమిత్తం గతంలో జారీ చేసిన జీవో 111కు సంబంధించిన పిటిషన్లలో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటరు సమర్పించాలని గతంలో ఆదేశించినా అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. కోర్టు ఉత్తర్వులంటే ఇంత ఉదాసీనత సరికాదని చెప్పింది. చివరిగా ఈ ఒక్కసారికి గడువు ఇస్తున్నామంటూ విచారణను వాయిదా వేసింది.

జీవో 111ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పర్యావరణవేత్త ప్రొ.జీవానందరెడ్డి తదితరులు 2007లో దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాది కె.ఎస్‌.మూర్తి వాదనలు వినిపించారు. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల నీటి పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు వాటి పరిధిలో 10 కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టరాదని గతంలో ప్రభుత్వం జీవో 111 జారీ చేసిందన్నారు.

ఏజీ కార్యాలయం తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది పి.ఉష వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు ఇందులో మరో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. కౌంటరు దాఖలు చేయడానికి 3వారాల గడువు కావాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్లు దాఖలు చేసి 15 ఏళ్లు గడిచిపోయాయని చెప్పింది. గతంలో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలిచ్చినా మళ్లీ గడువు కోరడమేమిటని ప్రశ్నించింది. ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లిస్తే వాయిదా వేస్తామని, చెల్లిస్తారా అంటూ అడిగింది. హెచ్‌ఎండీయే తరపు న్యాయవాది వై.రామారావు జోక్యం చేసుకుంటూ జీవో 111కు సంబంధించి రెండు విరుద్ధమైన అభ్యర్థనలతో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.