ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కె.శాసనం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైంది. ఈ పాఠశాలలో సుమారు 230 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాఠశాలలో ఇటుకలు మోసే పనులు విద్యార్థులకు అప్పగించారు.
విద్యార్థులు ప్రధానోపాధ్యాయుని మాట కాదనలేక తమ శక్తికి మించిన బరువులు మోస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు చలించిపోయారు. ప్రధానోపాధ్యాయుల తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: పిల్లలను ఇనుప రాడ్డుతో కొట్టి ఆపై ఆత్మహత్య!