హైదరాబాద్ నగరవాసులను 10కే రన్ మరోమారు పలకరించనుంది. నవంబర్ 24న నెక్లస్ రోడ్లో ఫ్రీడమ్ 10కే రన్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత, హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ డైరక్టర్ డి.సురేష్ బాబు, టాలీవుడ్ నటుడు నిఖిల్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఫ్రీడం హైదరాబాద్ 10కే రన్ లోగో, టీషర్ట్, ట్రోఫీలను ఆవిష్కరించారు. రన్లో పాల్గొనేందుకు ఇప్పటికే పది వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు సురేష్ బాబు తెలిపారు. దాదాపు 16వేల మందికి పైగా రన్లో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 10కే రన్‌తో పాటు.. 5కే రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేసినవారికి మెడల్స్ అందించనున్నట్టు ప్రకటించారు.