రాష్ట్రలో డ్రోన్ల ద్వారా ఔషధాలు, వ్యాక్సిన్ డెలివరీ చేపట్టే పైలెట్ ప్రాజెక్టుకు ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కన్సార్టియం కుదుర్చుకోనున్నట్లు.... ఆ సంస్థ తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో అత్యవసర మందులు, వ్యాక్సిన్లను మారుమూల ప్రాంతాలకు చేరవేసేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కంపెనీ వెల్లడించింది.
జియో మ్యాపింగ్, ట్రాక్ అండ్ ట్రేస్ లొకేషన్, రూటింగ్ షిప్మెంట్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఈ ప్రాజెక్టును సాకారం చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. రవాణా సౌకర్యం లేని ప్రాంతాలకు. 'మెడిసిన్ ఫ్రం స్కై' ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని వివరించింది. డ్రోన్ల ద్వారా మందుల వితరణ ప్రభుత్వ ప్రాధాన్య విధానాల్లో ఒకటని, ఈ విధానం ద్వారా రానున్నరోజుల్లో ఆరోగ్య పరికరాలు, మందుల సరఫరాను విస్తృతంచేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి మరో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్.!