Electricity charges : విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్‌లో ఇవాళ ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సి) బిల్డింగ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ).. బహిరంగ విచారణ నిర్వహించనుంది.
2022-23లో విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించాయి. నేటి బహిరంగ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి రానుంది.
ఇదీ చూడండి: