ETV Bharat / city

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్‌కు నేడు తుది గడువు

మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్​ గడువు నేటితో ముగియనుంది. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు.

The deadline for the telangana graduate MLC nomination is today
పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్‌కు నేడు తుది గడువు
author img

By

Published : Feb 23, 2021, 7:28 AM IST

మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్​ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఈ స్థానానికి మొత్తం 81 నామపత్రాలు దాఖలయ్యాయి. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. 26 వరకు నామపత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 14 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఓటింగ్​ను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరపనున్నారు.

మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి 5.60 లక్షల మంది ఓటర్లు.. 616 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల డీఆర్సీ కేంద్రంగా హైదరాబాద్​లోని ఇండోర్ స్టేడియాన్ని ఎంపిక చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.