ETV Bharat / city

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి: సీఎం కేసీఆర్

రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్లాఘించారు. ప్రతాపరెడ్డి జయంతి(మే 28) సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

kcr
kcr
author img

By

Published : May 28, 2022, 7:03 AM IST

తెలంగాణపై వివక్షను నాడే గోలకొండ పత్రిక ద్వారా ఎదిరించి తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన... సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడు సురవరం అని సీఎం కేసీఆర్‌ శ్లాఘించారు. ప్రతాపరెడ్డి జయంతి(మే 28) సందర్భంగా ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

‘‘సురవరం, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ బిడ్డ.. తెలంగాణ సాధన పోరాటంలో సురవరం స్ఫూర్తి ఇమిడి ఉంది. ఆయన జయంతి ఉత్సవాలను ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కమలాకర్‌, శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు తెలంగాణకు సురవరం చేసిన సేవలను ప్రశంసించారు.

ఇవీ చదవండి:45 కంపెనీలతో భేటీ... రాష్ట్రానికి రూ. 4,200 కోట్ల పెట్టుబడులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.