పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. దేశంలో ఏ ఒక్క ముస్లింకి దీని ద్వారా అన్యాయం జరగదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు పౌరసత్వ సరణ చట్టంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీఏఏ వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ముస్లిం పాలిత ప్రాంతాల్లో హింసను ఎదుర్కొని.. మనదేశానికి వలస వస్తున్న ఆయా దేశాల మైనారిటీలను భారత పౌరులుగా గుర్తించి.. వారికి బాసటగా నిలిచేందుకు ఈ చట్టం ఉందని కిషన్రెడ్డి అన్నారు. ఇక్కడి ముస్లింలను తరిమేసే ఉద్దేశం కేంద్రానికి లేదని పేర్కొన్నారు. ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావద్దన్నారు. కాంగ్రెస్, తెరాస, మజ్లిస్లు సీఏఏకి మత రంగును పూస్తున్నాయని ఆరోపించారు.
ఇవీ చూడండి: 'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'