ప్రైవేటు విద్యార్థులకు సీబీఎస్ 10, 12వ తరగతి పరీక్షలు ఆగస్టు 16న ప్రారంభం కానున్నట్లు బోర్డు బుధవారం వెల్లడించింది. సెప్టెంబరు 15 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులకు అమలు చేసినట్టు.. అసెస్మెంట్ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి అసెస్మెంట్ రికార్డులు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొంది.
సీబీఎస్ఈ నిర్ణయంపై ప్రైవేటు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు కార్యాలయం ఎదుట బుధవారం పలువురు విద్యార్థులు నిరసన తెలిపారు. సీబీఎస్ఈ బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి: Pegasus: ఈ సంకేతాలుంటే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్లే!