తిరుమల శ్రీవారి దర్శనాన్ని జూన్ 30 వరకు నిలిపివేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై తితిదే స్పందించింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంపై ధర్మకర్తల మండలి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థాన సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవీ చూడండి: తిరుమలలో మంచు దృశ్యాల కనువిందు