మంత్రి కేటీఆర్ భాజపాపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్త చేసుకున్న ఆత్మహత్యాయత్నం ఘటనను దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేసి లాఠీ ఛార్జీ, కాల్పులు జరిపించుకునేందుకు కుట్ర పన్నుతున్నట్లు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. ఓటమి భయం మంత్రి కేటీఆర్ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఒక ఉపఎన్నికలో గెలుపు కోసం ఇలాంటి దిగజారే పనిని భాజపా చేయబోదని వ్యాఖ్యానించారు. హుజూర్‌నగర్‌లో ప్రచారం చేసిన కేటీఆర్ దుబ్బాకలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
భాజపా కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసుకున్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలు ఉన్నాయన్నారు. శ్రీనివాస్ కోలుకునే వరకూ పార్టీ నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని ఆయన కోరారు.
ఇవీచూడండి: దుబ్బాకలో గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్