SSC Results: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలు మరోసారి తమ సత్తా చాటారు. పరీక్షలకు సుమారు 6,15,900 మంది విద్యార్థులు హాజరుకాగా.. 4.14 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత 67.26 శాతంగా నమోదైంది.
ఫలితాల్లో 78.3 శాతంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 49.7 శాతంతో అనంతపురం జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఫలితాల్లో 797 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 71 పాఠశాలల్లో ఉత్తీర్ణతే నమోదు కాలేదని తెలిపారు.
జులై 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. రేపటి నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించవచ్చని తెలిపిన ఆయన.. ఈ నెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఫలితాలు త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్థులతో పాటు.. సప్లిమెంటరీ విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి: