ETV Bharat / city

పాతబస్తీలో టెన్షన్​ టెన్షన్​, భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు - hyderabad latest news

Tension in Old city ఎమ్మెల్యే రాజాసింగ్​ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాలబస్తీలో టెన్షన్​ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి పూట వందల సంఖ్యలో యువకులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనలు చేశారు. మరోవైపు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tension in Old city and youth protest against mla rajasingh

author img

By

Published : Aug 24, 2022, 7:50 AM IST

పాతబస్తీలో టెన్షన్​ టెన్షన్​, భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు

Tension in Old city: హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన యువత రోడ్లపైకి చేరుకున్నారు. చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో... వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. మదీన, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ కూడలిలో గుంపులుగా చేరిన పలువురు... కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు.

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... ఆందోళనకారులు విధ్యంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల వరకు నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. మరో వైపు భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇతరులెవరు ఆయన ఇంటి వైపు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.