ETV Bharat / city

పురిటినొప్పులతో వెళ్తే 22 లక్షల బిల్లు.. అయినా శిశువు మృతి, బాలింత పరిస్థితి విషమం

Tension at Care Hospital
Tension at Care Hospital
author img

By

Published : Oct 29, 2021, 5:18 PM IST

Updated : Oct 29, 2021, 8:08 PM IST

17:15 October 29

కేర్‌ ఆస్పత్రిలో మహిళకు పుట్టిన శిశువు రెండ్రోజులకే మృతి

హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. ఆ గర్భిణికి పుట్టిన శిశువు రెండ్రోజులకే మృతి చెందగా.. బాలింత పరిస్థితి కూడా విషమంగా మారింది. 10 రోజులుగా ఆమెకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రూ.22 లక్షలు వసూలు చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇంకా డబ్బుల కోసం ఆస్పత్రి యాజమాన్యం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిశువు మృతి.. బాలింత పరిస్థితి విషమం..

ముషీరాబాద్​ పార్శిగుట్టలో నివాసముంటున్న డి. శిల్ప(28)కు పురిటి నొప్పులు రాగా ఈ నెల 16న కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే ఆస్పత్రి వైద్యులు శిల్పకు ఉమ్మి నీరు తక్కువగా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని ఆమె భర్త ప్రభాకర్​కు తెలిపారు. అదేరోజు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. పుట్టిన శిశువు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువు రెండో రోజునే మృతి చెందింది. మరోవైపు.. శిల్ప ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఆమెకు రక్తం తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలుకు 22 మంది కుటుంబ సభ్యులు రక్తదానం చేశారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా.. ఇంకా విషమించింది. వెంటనే ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికి కూడా తన భార్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని.. వైద్యులను ఆరా తీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యపు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబీకులు ఆందోళకు దిగారు.

22 మంది రక్తమిచ్చినా.. బిల్లేశారు..

"వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయింది. వారి నిర్లక్ష్యంతోనే నా భార్య పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు 22 లక్షల రూపాయలు చెల్లించాం. 22 మంది రక్తదానం చేశాం. అయినా బిల్లులో శిల్పకు రక్తం ఎక్కించడానికి గానూ మూడు లక్షల రూపాయలు వేశారు. పది రోజుల నుంచి చికిత్స ఇస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులన్నా.. నా భార్య క్షేమంగా తిరిగిరావాలని ఈ ఆస్పత్రికి తీసుకొస్తే.. 22 లక్షలు కట్టించుకుని ఇప్పుడు పరిస్థితి బాలేదని చెప్తున్నారు." 

             - ప్రభాకర్, శిల్ప భర్త

బాధితురాలి కుటుంబసభ్యుల ఆందోళనతో.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Oct 29, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.