ETV Bharat / city

TOP TEN NEWS TODAY : టాప్​టెన్​ న్యూస్​ @1PM

author img

By

Published : Jan 22, 2022, 12:57 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

EN NEWS TODAY, telangana news
తెలుగు టాప్​టెన్​ న్యూస్
  • హైదరాబాద్​ గొలుసు దొంగను అహ్మదాబాద్​లో

హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలతో కలకలం సృష్టించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. గొలుసు దొంగతనాలకు పాల్పడింది పాత నేరస్థుడు ఉమేశ్‌గా గుర్తించారు.

  • పేకాట ఆడిన స్థిరాస్తి వ్యాపారులు అరెస్టు

హైదరాబాద్​ గచ్చిబౌలిలో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబర్​పేట్​కు చెందిన మార్కారెడ్డి.. గచ్చిబౌలిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పేకాడుతున్న 12 మంది స్థిరాస్తి వ్యాపారులను అరెస్టు చేశారు.

  • చెరో పెట్రోల్‌ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం: బొండా ఉమ

ఏపీలోని గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. తెదేపా నిజనిర్ధారణ కమిటీ కన్వెన్షన్‌ సెంటర్‌ను పరిశీలించడానికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో ఏపీ మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా డిమాండ్ చేశారు.

  • 'ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారు.. కానీ బదిలీల్లో చూడరేం.?'

ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే స్థానికత కోసమని.. స్థానిక కోటాలో బదిలీలు చేయకుంటే రాష్ట్రం ఏర్పడింది ఎందుకుని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి​ స్టేషన్​కు తరలించారు.

  • ముస్తాబవుతున్న పంచ నారసింహుల దివ్యక్షేత్రం

యాదాద్రి పంచ నారసింహుల పుణ్యక్షేత్రం... మహాదివ్యంగా ఆవిష్కృతమవుతోంది. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ఎదురుగా... పసిడి వర్ణంతో కూడిన దర్శన వరుసల సముదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వైష్ణవతత్వం ఉట్టిపడేలా ఐరావతం, శంఖు, చక్ర, తిరునామాలు, మహా విష్ణు రూపాలు, ఆధ్యాత్మిక మందిరాల ఆకృతులు క్యూలైన్లలో తీర్చిదిద్దారు.

  • వెనక్కి తగ్గిన ప్రియాంక

యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్‌ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు.

  • పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం

వివాహానికి వెళ్లి వస్తుండగా.. లారీ, ఎస్​యూవీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని సువర్ణ్​పుర్​ జిల్లాలో జరిగింది.

  • ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్​లోని ఓ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.5గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.

  • ఐపీఎల్ మెగావేలానికి 1214 మంది క్రికెటర్లు

ఐపీఎల్-2022 కోసం జరగబోయే మెగావేలానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 12, 13న ఈ వేలం జరగనుంది. తాజాగా ఇందుకోసం రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది పాలకమండలి.. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.

  • నాగశౌర్య క్రేజీ లుక్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో థాంక్యూ, రావణాసుర, నాగశౌర్య కొత్త చిత్రం సంగతులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.