తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్ర బస్ సర్వీసుల ఒప్పందం తేలకుండానే సమావేశం ముగిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7గంటల 15నిమిషాల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఇరు రాష్ట్రాల ఈడీలు బస్ సర్వీసులు తిరిగే కిలోమీటర్ల మీద చర్చలు జరిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈడీలు 2లక్షల కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అధికారులకు ప్రతిపాదనలను చేశారు.
ఇరు రాష్ట్రాలు ఒక లక్షా 61వేల కిలోమీటర్ల సమాన ప్రాతిపదికన తిప్పాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఏపీ - తెలంగాణ ఈడీలు తమ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత మరోసారి సమావేశం అవుతామని అంగీకారానికి వచ్చారు.
ఇదీ చదవండి : గొడవ ఆపేందుకు ప్రయత్నించబోతే.. లారీ కిందకు తోసేశారు!