CM KCR TamilNadu Tour : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటన ప్రారంభమైంది. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా కేసీఆర్ బయలుదేరారు. బేగంపేట నుంచి తిరుచిరాపల్లికి వెళ్లి.. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగం వెళ్తారు. శ్రీరంగం రంగనాథస్వామికి కుటుంబ సమేతంగా పూజలు చేయనున్నారు.
ఇవాళ రాత్రి చెన్నైలో బస చేసి మంగళవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసే అవకాశముంది. కేంద్ర వైఖరి, రాజకీయ అంశాలపై స్టాలిన్‌తో చర్చించనున్నారు.
- ఇదీ చదవండి : CM KCR Tour: నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్..