ETV Bharat / city

Lokesh On HSBC: హెచ్​ఎస్​బీసీ మూతపడటం బాధాకరం: నారా లోకేశ్​

Lokesh On HSBC: 15 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర యువతకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బీసీ మూతపడటం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానుల పేరుతో చేసిన మోసం చాలన్న లోకేశ్​.. విశాఖను దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు.

author img

By

Published : Dec 16, 2021, 3:07 PM IST

Lokesh On HSBC
నారా లోకేశ్​

Lokesh On HSBC: సబ్జెక్ట్ లేని సీఎం.. 3 రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. తెదేపా హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్​గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని ధ్వజమెత్తారు. 15 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర యువతకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బీసీ మూతపడటం బాధాకరమని లోకేశ్​ అన్నారు.

  • సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది. 15 ఏళ్ళ నుండి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన #HSBC మూతపడటం బాధాకరం(1/3) pic.twitter.com/mExFwgUtsl

    — Lokesh Nara (@naralokesh) December 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసమర్థతకు నిదర్శనం

రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు నిశ్శబ్ధంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు' అన్న లోకేశ్​ విశాఖను దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న కంపెనీలనైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని కోరారు.

మన సైనికులు మట్టి కరిపించారు - లోకేశ్

విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జోహార్లు అర్పించారు. ప్రపంచం మొత్తానికి భారత దేశ సైనికుల శౌర్యం, పరాక్రమం గురించి తెలిసేలా సాధించిన విజయానికి 50 ఏళ్లని గుర్తు చేశారు. పాక్ దుస్సాహసాన్ని దీటుగా ఎదుర్కొని కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్​ సైన్యాన్ని మన సైనికులు మట్టి కరిపించారని కొనియాడారు. శత్రువుల వెన్నులో వణుకు పుట్టేలా చేసిన హీరోల సాహసం సదాస్మరణీయమని లోకేశ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Warangal TRS Leaders meeting: ఈనెల 20న కేసీఆర్ జనగామ టూర్... ఏర్పాట్లలో వరంగల్‌ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.