ETV Bharat / city

పార్లమెంట్​ స్థాయీ సంఘాల పునర్నియామకం.. కె.కేశవరావుకు కీలక బాధ్యతలు - Re-appointment of Parliamentary Level Associations

పార్లమెంట్​లోని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 24 పార్లమెంట్ స్థాయి సంఘాలను(Parliamentary Committees) పునర్నియమిస్తూ పార్లమెంట్ బులెటిన్ విడుదల చేసింది. మూడింటికి తెలుగు ఎంపీలను ఛైర్మన్లుగా నియమించింది. తెలంగాణకు చెందిన ఎంపీ కె. కేశవరావు(TRS MP K.Keshava Rao) పరిశ్రమల స్థాయీ సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

telugu-mps-are-appointed-as-chairmans-for-three-parliamentary-committees

author img

By

Published : Oct 10, 2021, 9:25 AM IST

పార్లమెంటులోని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 24 పార్లమెంటరీ స్థాయీ సంఘాలను(Parliamentary Committees) పునర్నియమిస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం బులెటిన్‌ విడుదలచేసింది. ఈ కమిటీలు సెప్టెంబరు 13వ తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు పేర్కొంది.

పరిశ్రమలు, వాణిజ్య స్థాయీ సంఘాల ఛైర్మన్లుగా తెరాస, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు(TRS MP K.Keshava Rao), విజయసాయిరెడ్డి, రవాణా, పర్యాటకం, సాంస్కృతిక విభాగం స్థాయీ సంఘం ఛైర్మన్‌గా టి.జి.వెంకటేష్‌ నియమితులయ్యారు. వాణిజ్య సంఘంలో సభ్యులుగా తండ్రీకుమారులైన ధర్మపురి శ్రీనివాస్‌, ధర్మపురి అర్వింద్‌లను నియమించారు. సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, న్యాయ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా గతంలో కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ వ్యవహరించగా ప్రస్తుతం ఆ స్థానంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీని నియమించారు. ఇవి మినహా రాజ్యసభ, లోక్‌సభ కమిటీలకు పాత వారే ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు. సామాజిక న్యాయం, సాధికారిత సంఘంలో తెలుగు ఎంపీలకు చోటు దక్కలేదు.

ఆరుగురికి స్థాన చలనం

మొత్తంగా ఆరుగురు తెలుగు ఎంపీలు(Telugu MPs) గతంలో ఉన్న సంఘాల నుంచి ఇతర సంఘాల్లోకి మారారు. గతంలో రైల్వే స్థాయీ సంఘంలో ఉన్న జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ (TRS MP Santhosh Kumar)పర్యావరణం, అడవులకు, ధర్మపురి శ్రీనివాస్‌ రవాణా నుంచి వాణిజ్యానికి మారారు. ఇంధనంలో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాంతోపాటు తాజాగా రక్షణ స్థాయీ సంఘంలోనూ సభ్యునిగా నియమితులయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వై.ఎస్‌.చౌదరి రెండు చొప్పున కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. గతంలో పట్టణాభివృద్ధిలో ఉన్న అయోధ్యరామిరెడ్డి ఎరువులు, రసాయనాల సంఘంలోకి, మోపిదేవి వెంకటరమణారావు బొగ్గు, ఉక్కు నుంచి రక్షణలోకి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పరిశ్రమల నుంచి పెట్రోలియం, సహజ వాయువుకు, కనకమేడల రవీంద్రకుమార్‌ పెట్రోలియం సహజ వాయువు నుంచి పరిశ్రమలకు మారారు.

వివిధ కమిటీలు, నియమితులైన సభ్యుల వివరాలు

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.