లండన్ గ్యాట్‌విక్ విమానాశ్రయంలో 30 మంది తెలంగాణ, ఏపీ వాసులు చిక్కుకున్నారు. ఈ నెల 22 నుంచి విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం వల్ల... ఇవాళే భారత్‌కు వచ్చేందుకు భారతీయులు టికెట్లు బుక్ చేసుకున్నారు. గ్యాట్‌విక్ విమానాశ్రయానికి చేరుకున్న 70 మందిలో తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, గుజరాత్ వాసులు ఉన్నట్లు సమాచారం.
భారత్‌కు విమాన సేవలు నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించటంతో ప్రయాణికులు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమను ఇండియాకు పంపించాలని అధికారులను వేడుకున్నారు. ఈటీవీ తెలంగాణకు సిరిసిల్ల వాసి శరణ్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు.