Minister Ktr news: సంసద్ గ్రామీణ యోజనలో దేశంలో తొలి 10 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ మేరకు గ్రామాల జాబితాను కేటీఆర్ ట్వీట్ చేశారు. మొదటి 20 స్థానాల్లో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని మంత్రులు పేర్కొన్నారు. పల్లెప్రగతి లాంటి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.
-
Proud to share that all 10 out of top 10 villages in Sansad Adarsh Garmina Yojana are from #Telangana👏 19 out of top 20 villages from TS
— KTR (@KTRTRS) April 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Heartiest congratulations to Hon’ble CM KCR Garu for his vision, especially Palle Pragathi. Compliments to PR Minister @DayakarRao2019 & team pic.twitter.com/z4dhX6I4OV
">Proud to share that all 10 out of top 10 villages in Sansad Adarsh Garmina Yojana are from #Telangana👏 19 out of top 20 villages from TS
— KTR (@KTRTRS) April 26, 2022
Heartiest congratulations to Hon’ble CM KCR Garu for his vision, especially Palle Pragathi. Compliments to PR Minister @DayakarRao2019 & team pic.twitter.com/z4dhX6I4OVProud to share that all 10 out of top 10 villages in Sansad Adarsh Garmina Yojana are from #Telangana👏 19 out of top 20 villages from TS
— KTR (@KTRTRS) April 26, 2022
Heartiest congratulations to Hon’ble CM KCR Garu for his vision, especially Palle Pragathi. Compliments to PR Minister @DayakarRao2019 & team pic.twitter.com/z4dhX6I4OV
'సంసద్ గ్రామీణ యోజనలో తొలి 10 స్థానాల్లో తెలంగాణవే. దేశవ్యాప్తంగా 10 స్థానాల్లో రాష్ట్రానికి చెందిన గ్రామాలే ఉండడం గర్వకారణం. తొలి 20 స్థానాల్లో 19 తెలంగాణ గ్రామాలు ఉన్నాయి. సీఎం ఆలోచన, పల్లెప్రగతి వల్లే ఇది సాధ్యమైంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ బృందానికి అభినందనలు.'-కేటీఆర్
Minister Errabelli news: యాదాద్రి జిల్లా వాడపర్తి దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా... కరీంనగర్ జిల్లా కొండాపూర్, నిజామాబాద్ జిల్లా పల్డా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్, యాదాద్రి జిల్లా కొలనుపాక, నిజామాబాద్ జిల్లా వెల్మల్, జగిత్యాల జిల్లా మూలరాంపూర్, నిజామాబాద్ జిల్లాలోని తానా కుర్ద్, కుక్నూర్, కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి మొదటి పదిస్థానాల్లో నిలిచాయి.
'సంసద్ గ్రామీణ యోజనలో దేశంలో మొదటి 10 గ్రామాలు తెలంగాణవే నిలిచాయి. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవాళ్లకు ఇది సూటి సమాధానం. సీఎం కేసీఆర్ మాననపుత్రికైన పల్లెప్రగతి వల్లే సాధ్యమైంది. పల్లెప్రగతితో పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు, హంగులు తోడై అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.'-ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఇటీవల వచ్చిన 19 అవార్డులకు ఇది అదనంగా వచ్చిన ప్రశంస అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇప్పటికే బహిర్భూమి రహితం వంటి అనేక అంశాల్లో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఉత్తమ గ్రామాల ఎంపిక, కేంద్రం ప్రశంసలే నిదర్శమని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:మూడోసారి అధికారం చేపట్టేలా వ్యూహాలుంటాయి: కేటీఆర్