ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

TELANGANA TOP TEN NEWS
TELANGANA TOP TEN NEWS
author img

By

Published : Feb 8, 2022, 6:59 PM IST

  • సమతామూర్తి కేంద్రంలో అమిత్‌ షా..

Amit shah Muchintal Visit : ముచ్చింతల్​లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. శ్రీరామనగరంలోని 108 దివ్యక్షేత్రాలు దర్శించుకుంటున్న అమిత్‌ షా.. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు.

  • ప్రధాని మాటలు హృదయాలను గాయపరిచాయి..

Harishrao on Modi: వేరుపడ్డాం.. బాగుపడ్డామని ప్రజలు భావిస్తున్నారని.. కానీ రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను గాయపరిచాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భాజపా ఎంతగా వ్యతిరేకిస్తుందో... ఈ ఘటనతో మరోసారి రుజువైందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

  • అందుకు మోదీకి ధన్యవాదాలు.. కానీ..

Ponnala Laxmaiah On PM Modi: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.. అని ప్రధాని మోదీ ఒప్పుకున్నందుకు ధన్యావాదాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని చేసిన విమర్శలను పొన్నాల ఖండించారు.

  • మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్..

Congress Activists Protest: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వారు యత్నించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

  • కోడిపుంజుకు బస్​టికెట్​.. ఎందుకటే..?

Bus ticket to Cock: ఓ కోడిపుంజు ఆర్టీసీ బస్సెక్కింది. మరి బస్సెక్కితే కండక్టర్​ ఊరికే ఉంటాడా..? తన డ్యూటీ తాను చేశాడు. ఆ కోడిపుంజుకు టికెట్​ కొట్టాడు. అందేటీ.. కోడిపుంజుకు కూడా టికెట్​ కొడతారా..? అని నోరెళ్లబెట్టకండీ.. బస్సెక్కే ప్రతీ జీవికి టికెట్​ కొడతారంటా..! ఆ కథేంటో మీరూ చూడండి..

  • హిజాబ్' వివాదం హింసాత్మకం..

Karnataka Hijab row: హిజాబ్ వివాదం కర్ణాటకను కుదిపేస్తోంది. పలు జిల్లాలో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరగడం వల్ల.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు, దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది.

  • 35 ఏళ్ల చరిత్రను తిరగరాసేనా..?

UP Polls 2022: 2007లో బీఎస్పీ.. 2012లో ఎస్పీ.. 2017లో భాజపా.. ఇలా ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో .. గత 35ఏళ్లలో అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. అయితే ఈ సారి గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్​. మరి ఆయన ఆశయం నెరవేరుతుందా?

  • మంచులో గల్లంతైన జవాన్లు మృతి..

Arunachal Pradesh Army Avalanche: అరుణాచల్​ప్రదేశ్​లో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఈ ఘటన జరగ్గా.. మంగళవారం మృతదేహాలు లభించాయని భారత సైన్యం తన ప్రకటనలో తెలిపింది.

  • సిరీస్​పై కన్నేసిన 'భారత్'​..

Ind vs WI 2nd Odi: వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని భారత్‌ జట్టు భావిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన.. బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ గెల్చి, మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ దక్కించుకోవాలని యోచిస్తోంది.

  • ఆ సీన్​లో తారక్, చరణ్​ ఇరగదీశారు..

RRR Movie: మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్​, యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్​ఆర్​ఆర్. ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. టీజర్​, ట్రైలర్​లో చూపించని ఓ సీన్​ ఉందని.. ఆ సీన్​ థియేటర్లో చూస్తే మీ నరాలు బిగుసుకుపోతాయన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.