ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana-top-ten-news-today-till-now
టాప్​టెన్​ న్యూస్ @1PM
author img

By

Published : Dec 17, 2020, 12:58 PM IST

1. బంగ్లాదేశ్​తో మైత్రికి ప్రాధాన్యం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా గురువారం వర్చువల్​ సదస్సులో పాల్గొన్నారు. భారత్​-బంగ్లాదేశ్​ మధ్య చిలాహటి-హల్దిబరి రైలు లింక్​ ఆవిష్కరించారు. ఈ క్రమంలో తమ విదేశీ విధానంలో బంగ్లాదేశ్​కు పెద్ద పీట వేసినట్టు మోదీ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. మరో రైతు మృతి

దిల్లీ-హరియాణా సింఘూ సరిహద్దు వద్ద మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్​కు చెందిన రైతు.. అక్కడ కాలువలో పడిపోయినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలించగా.. మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

3. పాదచారిపై కూలిన పిల్లర్​

రాజస్థాన్‌ భరత్‌పుర్‌లోని ఓ మార్కెట్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్‌ కూలి.. అటుగా వెళ్తున్న పాదచారిపై పడింది. తీవ్రగాయాల పాలైన ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

4. ఆన్​లైన్ అప్పు.. ప్రాణానికి ముప్పు

ఆన్‌లైన్‌ అప్పులకు మరో వ్యక్తి బలయ్యారు. నిర్దేశించిన గడువులోగా రుణం చెల్లించలేదన్న కారణంగా అప్పిచ్చిన సంస్థ రుణగ్రహీత వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించడంతో ఓ ప్రభుత్వ అధికారిణి బలవన్మరణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

5. పాలమూరులో పాప నవ్వింది..

వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరులో లింగ వివక్ష తగ్గుతోంది.. స్త్రీ శక్తి పెరుగుతోంది.. పురుషుల కన్నా మహిళల నిష్పత్తిలో వృద్ధి నమోదవుతోంది.. ఆడపిల్ల పుడితే అయ్యో అనుకున్న పరిస్థితి నుంచి నేడు మహాలక్ష్మిగా భావించి ఆహ్వానించే పరిస్థితి నెలకొంది.. వెయ్యి మంది పురుషులకు సగటున 1,039 మంది మహిళల నిష్పత్తి నమోదవడమే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

6. మరోసారి రేగా కాంతారావు ఫైర్

అటవీ అధికారులపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మరోసారి విమర్శల జల్లు కురిపించారు. కొందరు అధికారుల వల్లే అడవులు నాశనమయ్యాయని ఆరోపించారు. భూములు అధికారుల కబ్జాలో ఉంటే శిక్షకు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. అధికారులు.. నిజాయితీపరులైతే సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. పెట్టుబడికి ఉత్తమ మార్గాలు

చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఈపీఎఫ్​ సహా పలు ఇతర చిన్న పొదుపు పథకాలు ముఖ్యమైనవి. మరి ఈ రెండింటిలో ఏది ఉత్తమం? వేటికి ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది? ఎవరెవరికి ఏ పథకం ఉపయోగపడుతుంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. బైడెన్​, పెన్స్​కు కరోనా టీకా!

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్​ త్వరలో టీకా వేయించుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ బహిరంగంగా టీకా తీసుకోనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

9. పాండ్యా డిన్నర్​ డేట్

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి.. నాలుగు నెలలుగా ఇంటికి దూరంగా ఉన్నాడు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చిన అతడు.. తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా భార్య నటాషా స్టాంకోవిచ్​ను డిన్నర్​ కోసం బయటకు తీసుకువెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

10. గన్స్​తో వచ్చేసిన అడివి శేష్

మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. అలాగే విశాల్, ఆర్య నటిస్తోన్న 'ఎనిమీ' చిత్రం నుంచి విశాల్ లుక్​ను రిలీజ్ చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.