ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @3PM - telangana latest news updates

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news till now
టాప్​టెన్​ న్యూస్ @3PM
author img

By

Published : Dec 12, 2020, 2:57 PM IST

  • కేంద్ర మంత్రితో కేసీఆర్‌ భేటీ

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుపై హర్‌దీప్‌సింగ్‌ పురితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం..

సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు చెలరేగడంతో పరిశ్రమ నుంచి కార్మికులు పరుగులు తీశారు. పరిశ్రమలో కొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నాట్లు వేస్తుండగా..

ఏపీలోని నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. నాట్లు వేస్తూ హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన కూలీలను గ్రామస్థులు పొదలకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ముగిసిన అభిప్రాయ సేకరణ

నాలుగు రోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణ ముగిసింది. నేతల అభిప్రాయాల నివేదికను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ కాంగ్రెస్​ అధిష్ఠానానికి సమర్పించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆధార్‌ ఉంటేనే ఉచిత నీరు

జీహెచ్​ఎంసీలో ఉచిత తాగునీటి పథకానికి ఇకపై ఆధార్​ తప్పనిసరి. దిల్లీలో అమలు చేస్తున్నట్లుగా ఇక్కడ కూడా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తాగునీటి కనెక్షన్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆదాయం పెంచేందుకే ..

కొత్త సాగు చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకుంటారని ప్రధాని మోదీ చెప్పారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. కొత్త చట్టాల్లో పేర్కొన్నట్లుగా రైతులు తమ పంట ఉత్పత్తుల్ని వారి అభీష్టం మేరకు మండీల్లో లేదా బయట.. ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇబ్బందుల్లో విజయ్​ మాల్యా

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని లండన్​ పరారైన మద్యం వ్యాపారి విజయ్​ మాల్యాకు ఇప్పడు నిధుల కొరత వెంటాడుతోంది. ఫ్రాన్స్​లోని స్థిరాస్తులను ఈడీ జప్తు చేసిన క్రమంలో జీవన, లీగల్​ ఖర్చుల కోసం బ్రిటన్​ హైకోర్టును ఆశ్రయించారు మాల్యా. ఫ్రెంచ్​ ప్రాపర్టీ అమ్మకంతో వచ్చిన నిధుల్లోంచి కొంత భాగం పొందేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమెరికా ఆస్పత్రులు ఫుల్​

అగ్రరాజ్యంలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి వైద్యసిబ్బంది. దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిని చూసినా కరోనా రోగులతోనే నిండిపోయింది. వైద్య సదుపాయాలు, సిబ్బంది కొరతతో అగ్రరాజ్యంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ధావన్​ దీటైన కౌంటర్​

ఇన్​స్టాలో తాను పోస్ట్​ చేసిన ఫొటోకు వ్యంగ్యంగా కామెంట్​ చేసిన నెటిజన్​కు గట్టిగా బదులిచ్చాడు టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​. అది కాస్త వైరల్​గా మారింది. ఇంతకీ అసలేం జరిగింది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మరోసారి వ్యాఖ్యాతగా తారక్‌?

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ మరోసారి బుల్లితెరపై ఓ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. ఇప్పటికే దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్​లో భారీ సెట్​ వేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తారక్​ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.