ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 7PM - 7PM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Aug 23, 2022, 6:58 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న బండి, ఈ యాత్రను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. పక్కాగా చేస్తాం, ఎవరు ఆపుతారో చూస్తామని వెల్లడించారు.

  • త్వరలో కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తదన్న ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్‌ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని భాజపా ఎంపీ దర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉంటుందని.. త్వరలోనే సీబీఐ ఆమెను ముద్దాయిగా ప్రకటిస్తుందని స్పష్టంచేశారు.

  • కేసీఆర్ కుటుంబంపై దాడి చేస్తే సహించేది లేదన్న ఎర్రబెల్లి

ఎమ్మెల్సీ కవితపై భాజపా నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబంపై ఎలాంటి మచ్చలేదని మంత్రి తెలిపారు. కేసీఆర్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారని వెల్లడించారు.

  • అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ ముందు ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ విచారం వ్యక్తం చేశారు.

  • నీతీశ్​ బలపరీక్షకు ముందు స్పీకర్ కీలక వ్యాఖ్యలు

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ బలపరీక్ష ఎదుర్కోవడానికి ఒక్కరోజు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ విజయ్ కుమార్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

  • 'కోహ్లీ పరుగుల దాహం ఇంకా తీరలేదు'

వచ్చే ఆదివారం ఆసియా కప్‌ ప్రారంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ తలపడనున్న వేళ.. కోహ్లీ ఫామ్‌ గురించి ఇండియన్​ టీమ్ మాజీ ​కోచ్​​ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • సింధుకు మోదీ ఐస్​క్రీమ్​ పార్టీ వెనక ఇంత కథ ఉందా

ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి సందడి చేసిన స్టార్ షట్లర్​ పీవీ సింధు ప్రధాని మోదీ తనకిచ్చిన ఐస్​క్రీమ్​ ప్రామిస్​ను గుర్తుచేసుకుంది. అలానే మోదీ తనను ఎలా ప్రోత్సహించారో వివరించింది. బ్యాడ్మింటన్​ కాకుండా ఫుట్​బాల్​, బాక్సింగ్​, వాలీబాల్​ అంటే తనకిష్టమని చెప్పింది. ఇంకా పలు విషయాలను పంచుకుంది.

  • మీ జీమెయిల్​ ఖాతాలో వేరేవాళ్లు లాగిన్ అయ్యారని డౌటా, చెక్ చేయండిలా

ప్రస్తుత కాలంలో అత్యధిక మంది వినియోగించే ఈమెయిల్‌ సర్వీసుల్లో గూగుల్‌ సంస్థ అందించే జీమెయిల్‌ ముందుంటుంది. పర్సనల్​గా, ప్రొఫెషనల్​గా ఈ అప్లికేషన్​ను దాదాపు అందరూ వినియోగిస్తున్నారు. అలాంటి జీమెయిల్ ఖాతాను సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. దాని కోసం ఈ చిట్కాలు పాటించండి.

  • రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14 వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్... రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

  • ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్​కు గ్రీన్​సిగ్నల్

సినిమా షూటింగ్స్​కు ప్రాధాన్య క్రమంలో అనుమతించనున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి షూటింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

  • 'ప్రజాసంగ్రామ యాత్ర పక్కాగా చేస్తాం'

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న బండి, ఈ యాత్రను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. పక్కాగా చేస్తాం, ఎవరు ఆపుతారో చూస్తామని వెల్లడించారు.

  • త్వరలో కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తదన్న ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్‌ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని భాజపా ఎంపీ దర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉంటుందని.. త్వరలోనే సీబీఐ ఆమెను ముద్దాయిగా ప్రకటిస్తుందని స్పష్టంచేశారు.

  • కేసీఆర్ కుటుంబంపై దాడి చేస్తే సహించేది లేదన్న ఎర్రబెల్లి

ఎమ్మెల్సీ కవితపై భాజపా నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబంపై ఎలాంటి మచ్చలేదని మంత్రి తెలిపారు. కేసీఆర్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారని వెల్లడించారు.

  • అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ ముందు ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ విచారం వ్యక్తం చేశారు.

  • నీతీశ్​ బలపరీక్షకు ముందు స్పీకర్ కీలక వ్యాఖ్యలు

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ బలపరీక్ష ఎదుర్కోవడానికి ఒక్కరోజు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్​ విజయ్ కుమార్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

  • 'కోహ్లీ పరుగుల దాహం ఇంకా తీరలేదు'

వచ్చే ఆదివారం ఆసియా కప్‌ ప్రారంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్‌ తలపడనున్న వేళ.. కోహ్లీ ఫామ్‌ గురించి ఇండియన్​ టీమ్ మాజీ ​కోచ్​​ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • సింధుకు మోదీ ఐస్​క్రీమ్​ పార్టీ వెనక ఇంత కథ ఉందా

ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి సందడి చేసిన స్టార్ షట్లర్​ పీవీ సింధు ప్రధాని మోదీ తనకిచ్చిన ఐస్​క్రీమ్​ ప్రామిస్​ను గుర్తుచేసుకుంది. అలానే మోదీ తనను ఎలా ప్రోత్సహించారో వివరించింది. బ్యాడ్మింటన్​ కాకుండా ఫుట్​బాల్​, బాక్సింగ్​, వాలీబాల్​ అంటే తనకిష్టమని చెప్పింది. ఇంకా పలు విషయాలను పంచుకుంది.

  • మీ జీమెయిల్​ ఖాతాలో వేరేవాళ్లు లాగిన్ అయ్యారని డౌటా, చెక్ చేయండిలా

ప్రస్తుత కాలంలో అత్యధిక మంది వినియోగించే ఈమెయిల్‌ సర్వీసుల్లో గూగుల్‌ సంస్థ అందించే జీమెయిల్‌ ముందుంటుంది. పర్సనల్​గా, ప్రొఫెషనల్​గా ఈ అప్లికేషన్​ను దాదాపు అందరూ వినియోగిస్తున్నారు. అలాంటి జీమెయిల్ ఖాతాను సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. దాని కోసం ఈ చిట్కాలు పాటించండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.